Banana Peel | దంతాలపై పసుపు మరకలున్నాయా? అరటి తొక్కతో చేయండి ఈ సింపుల్ టిప్..!
Banana Peel | నేటి కాలంలో టీ, కాఫీ ఎక్కువగా తాగే అలవాటు, సరైన బ్రషింగ్ లేకపోవడం వల్ల చాలా మందికి దంతాలు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. దీనివల్ల చిరునవ్వుపై ప్రభావం పడడమే కాక, ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతోంది. అయితే ఇదంతా ఖర్చుతో కూడిన డెంటల్ ట్రీట్‌మెంట్ లేకుండానే ఇంట్లోనే సులభంగా పరిష్కరించవచ్చు. అదీ అరటిపండు తొక్కతో!
#image_title
అరటి తొక్కతో దంతాలు అందంగా..
అరటిపండు తిన్న తరువాత పీల్చేయకుండా దాని తొక్కను దంతాలపై రుద్దడం వల్ల పసుపు మరకలు తగ్గి, దంతాలు తెల్లగా మెరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టిప్‌ను వారానికి 2-3 సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
ఎలా ఉపయోగించాలి?
పండిన అరటిపండు తీసుకొని దాని తొక్కను విప్పండి.
ఆ తొక్కలోని తెల్లటి భాగాన్ని దంతాలపై మృదువుగా రుద్దండి.
2-3 నిమిషాల పాటు అలాగే ఉంచాక, గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి.
అరటి తొక్కలో ఉన్న ఖనిజాల మాయం
అరటి తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు దంతాలపై పేరుకుపోయిన మరకలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి పసుపు రంగును తగ్గించి, ప్రకృతిసిద్ధంగా తెల్లదనాన్ని తీసుకొస్తాయి.
బేకింగ్ సోడాతో మిక్స్ చేస్తే…
ఇంకొంత మెరుగైన ఫలితం కోసం, అరటి తొక్కతో పాటు బేకింగ్ సోడాను కలిపి ఉపయోగించవచ్చు.