Third Wave : థర్డ్ వేవ్ వస్తే.. పిల్లలకు ప్రమాదమేనా? నిపుణులు ఏమంటున్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Third Wave : థర్డ్ వేవ్ వస్తే.. పిల్లలకు ప్రమాదమేనా? నిపుణులు ఏమంటున్నారు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 June 2021,8:56 am

Third Wave : ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య మహమ్మారి. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే లక్షల మందిని ఆ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పేరుతో ఆ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. లక్షల మందిని బలి తీసుకుంది. కోట్ల మంది పస్తులు ఉండేలా చేసింది. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అందరూ అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి సెకండ్ వేవ్ కొంచెం నెమ్మదించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేస్తున్నారు. కరోనా కేసులు కూడా విపరీతంగా తగ్గిపోయాయి.

third wave dangerous to children

third wave dangerous to children

ఇది నిజంగా భారతీయులకు శుభవార్తే అయినా.. త్వరలోనే మరో ప్రళయం.. థర్డ్ వేవ్ రూపంలో ముంచుకురానున్నదట. అవును.. కరోనా ఫస్ట్ వేవ్.. ఎక్కువ శాతం.. వృద్ధులపైనే అటాక్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ మాత్రం యువతను టార్గెట్ చేసింది. రాబోయే కరోనా థర్డ్ వేవ్ మాత్రం పిల్లల మీద తన ప్రతాపం చూపించబోతోందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

third wave dangerous to children

third wave dangerous to children

Third Wave : థర్డ్ వేవ్ వస్తే ఏం చేయాలి?

కరోనా సెకండ్ వేవ్.. ప్రస్తుతం నెమ్మదించినా.. త్వరలోనే ఇంకో 4 నుంచి 6 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకాలు వేస్తున్నారు. దీంతో థర్డ్ వేవ్ వచ్చినా.. వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లు సేఫ్ అని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. 18 ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ముఖ్యంగా చిన్న పిల్లలు థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలి? అనేది తెలియడం లేదు. నిజానికి.. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు 4 శాతం పిల్లలు కూడా కరోనా బారిన పడలేదు. సెకండ్ వేవ్ సమయంలో కూడా 10 నుంచి 15 శాతం పిల్లలు మాత్రమే కోవిడ్ కు గురయ్యారు. వాళ్లకు కరోనా సోకినా.. చాలా స్వల్ప లక్షణాలు వెలుగు చూశాయి. అయితే.. థర్డ్ వేవ్ మాత్రం పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపించనుందట.

third wave dangerous to children

third wave dangerous to children

Third Wave : మూడో వేవ్ స్ట్రెయిన్ చాలా బలంగా ఢీకొనబోతోందా?

మొదటి స్ట్రెయిన్ కంటే రెండో స్ట్రెయిన్ చాలా బలంగా, త్వరగా వ్యాపించింది. అలాగే.. రెండో రకం స్ట్రెయిన్ కన్నా.. మూడో రకం స్ట్రెయిన్ ఇంకా బలంగా వ్యాపిస్తుందట. ప్రస్తుతం పిల్లల కోసం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో.. పిల్లల విషయంలో అందరూ భయపడుతున్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ ముంచుకొస్తే మాత్రం పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాళ్లకు మంచి ఫుడ్ పెట్టడంతో పాటు.. వాళ్ల ఇమ్యూన్ సిస్టమ్ ను చాలా స్ట్రాంగ్ గా చేస్తే.. థర్డ్ వేవ్ వచ్చినా.. పిల్లలపై ప్రభావం చూపదని అంటున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది