YS Jagan – Nara Lokesh : లోకేష్ కీ జగన్ కీ తేడా ఇదే..!
YS Jagan – Nara Lokesh : ఈ చర్చ ఇప్పుడు కాదు.. దాదాపు గత 10 ఏళ్ల నుంచి వినిపిస్తున్నదే. ఎవరు గొప్ప.. నారా లోకేశా? లేక వైఎస్ జగనా? ఎందుకంటే ఇద్దరూ దిగ్గజ ముఖ్యమంత్రుల బిడ్డలే. కానీ.. ఒక బిడ్డ ముఖ్యమంత్రి అయ్యారు. మరో బిడ్డ ముఖ్యమంత్రి కావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో నిలదొక్కుకోవడమే ఆయన వల్ల కావడం లేదు. అవును.. సీఎం జగన్ ముందు నారా లోకేశ్ ఒక బచ్చా.. అంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవపల్ మెంట్ పేరుతో
జరిగిన కుంభకోణానికి ప్రధాన సూత్రధారే నారా లోకేశ్ అని భరత్ ఆరోపించారు. డమ్మీ ఒప్పందాలు చేసుకొని రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీఎం హోదాలో ఉండి.. అసలు చంద్రబాబు అప్పుడు ఏం చేశారు. కొడుక్కి మద్దతు పలికారన్నారు.షెల్ కంపెనీల ద్వారా సొమ్ము మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఈ విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది. దోషులను వదిలే ప్రసక్తే లేదు. అసలు ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారుడే చంద్రబాబు పుత్రుడు అని చెప్పుకొచ్చారు.
YS Jagan – Nara Lokesh : షెల్ కంపెనీల ద్వారా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిన సొమ్ము
సీఎం జగన్ మీద విశ్వాసం లేకపోతే ఎందుకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తారంటూ భరత్ అన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. వైజాగ్ లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13 లక్షల కోట్ల ఒప్పందం జరిగిందన్నారు. నారా లోకేశ్.. ముఖేష్ అంబానీని విమర్శిస్తున్నారు. అసలు ఆయన స్థాయి ఏంటో కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు లోకేశ్. లోకేశ్ ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారు. ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదు. అన్నీ తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్ప అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు.