Kidnappers : కిడ్నాపర్ల కోసం.. చందాలు వేసుకుని మరి ₹15 లక్షల డబ్బులు పోగుచేసిన గ్రామస్తులు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kidnappers : కిడ్నాపర్ల కోసం.. చందాలు వేసుకుని మరి ₹15 లక్షల డబ్బులు పోగుచేసిన గ్రామస్తులు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :22 January 2023,12:20 pm

Kidnappers : సమాజంలో జరిగే రకరకాల మోసాలలో కిడ్నాపర్స్ చాలా తెలివిగా మోసం చేస్తారు. ఇంటిలో పిల్లాడినా లేదా భార్యను గాని.. ఇంకా కిడ్నాప్ చేయబడే కుటుంబానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు అడగటం స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా ధనవంతుల కుటుంబాలలో పిల్లలను ఎత్తుకెళ్లి కిడ్నాపర్లు వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయటం మనం చూస్తూనే ఉంటాం. ఈ రీతిలో బాధ్యత కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బులు చెల్లించి వారి దగ్గర నుండి తమ కుటుంబ సభ్యులను ప్రాణాలతో కాపాడుకుంటారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఓ కిడ్నాప్ ఊదాంతం సంచలనంగా మారింది. కిడ్నాపర్లకి డబ్బులు చెల్లించడానికి ఓ గ్రామం అంతా చందాలు వేసుకోవడం జరిగింది.

మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది..? ఆ ఊరంతా ఎందుకు చందాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అన్న విషయం గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో శ్యోపూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ అనే ముగ్గురు వ్యక్తులను రాజస్థాన్ లోని ఓ నేరస్థుల ముఠా కిడ్నాప్ చేయటం జరిగింది. తమకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తేనే వారిని ప్రాణాలతో విడిచిపెడతానని కిడ్నాపర్లు తెలియజేశారు. అయితే ఎక్కడ విషయం ఏమిటంటే కిడ్నాప్ కీ గురైన ముగ్గురు వ్యక్తులు కూడా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. దీంతో తమ కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకోవాలో.. దిక్కుతోచని పరిస్థితుల్లో సదరు కుటుంబ సభ్యులు ఉన్నారు.

today news Kidnappers in madhya pradesh jan 22

today news Kidnappers in madhya pradesh jan 22

దీంతో ఈ విషయం గ్రామస్తులంతా తెలుసుకొని కిడ్నాపర్లు అడిగిన 15 లక్షల రూపాయలు చెల్లించడానికి వివిధ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఊరంతా చాటించి.. గ్రామ పెద్దలు మొత్తం 15 లక్షల రూపాయలు చెల్లించారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే… ఊరిలో ఇల్లు వాకిలి లేకపోయినా గాని నిరుపేద కుటుంబ సభ్యులు 100 లేదా 200 ఇంకా 500 రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రీతిగా సదరు గ్రామస్తులంతా… గ్రామ మాజీ సర్పంచ్ సియారాం కి డబ్బులు అందించారు. ఇక ఇదే సమయంలో కిడ్నాపర్లను పట్టుకోవడానికి రాజస్థాన్ పోలీసులు రంగంలోకి దిగారు.

అంత మాత్రమే కాదు కిడ్నాపర్లపై రిపోర్టు కూడా ప్రకటించడం జరిగింది. వారి ఆచూకీ తెలిపిన వారికి 30 వేల రూపాయలు ఇస్తామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. శ్యోపూర్ జిల్లా… రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు గ్రామం. ఇక్కడ చాలా కిడ్నాప్ కేసులు చోటు చేసుకున్నాయి. వరుస కిడ్నాప్ ఘటనలు స్థానికులకు కలవరం పెడుతూ ఉంది. దీంతో పోలీసులు ప్రత్యేకమైన మెగా పెట్టినా కానీ కిడ్నాపర్లు…శ్యోపూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ అనే ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేయటం సంచలనం సృష్టించింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది