Tirupati By Election : ఈసారి వైసీపీకి దెబ్బేనా… తిరుపతి ఉపఎన్నికను ఎలా ఎదుర్కొంటుందో మరి..?
Tirupati By Election : ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉపఎన్నికలకు సంబంధించిన హడావుడి నడుస్తోంది. ఓవైపు తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక…. ఏపీలో తిరుపతి ఉపఎన్నిక. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హడావుడి. ఉపఎన్నిక హడావుడితో రెండు రాష్ట్రాల పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఏపీలో అయితే… తిరుపతి ఉపఎన్నికను ప్రధాన పార్టీలన్నీ చాలెంజ్ గా తీసుకున్నాయి.

tough fight for ycp in tirupati by election
స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే.. తిరుపతి ఉపఎన్నికకు షెడ్యూల్ రావడంతో… వెంటనే తమ అభ్యర్థులను బరిలోకి దింపి… ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించాయి పార్టీలు. అన్ని పార్టీల కంటే ముందు టీడీపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఆ తర్వాత వైసీపీ ప్రకటించింది. తాజాగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
నిజానికి… జనసేన పార్టీ తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ… బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని భావించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ… తాజాగా బీజేపీ… రత్నప్రభను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమెకు జనసేన కూడా మద్దతు ప్రకటించింది.
అయితే.. ఈనేపథ్యంలో తిరుపతిలో ఎవరు గెలుస్తారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే… తిరుపతి ఉపఎన్నికలో వైసీపీకి దెబ్బ పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tirupati By Election : రత్నప్రభ బరిలో దిగడంతో వైసీపీకి కష్టమే?
అయితే… ఇన్నిరోజులు వైసీపీకే తిరుపతి ఉపఎన్నిక అనుకూలంగా ఉండేది. బీజేపీ తాజాగా తమ అభ్యర్థిని ప్రకటించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎందుకంటే.. రత్నప్రభ.. మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో పాటు.. ఆమె ప్రజల మనసును గెలుచుకున్న అధికారిణి. తన పదవీ కాలంలో ఎంతో నిబద్ధత కలిగిన అధికారిణిగా ఆమె గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. దళితుల హక్కుల కోసం పోరాడిన కత్తి చంద్రయ్య వారసురాలు ఆమె. దీంతో తిరుపతి ప్రజలు ఆమె వైపు మెగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది.
మరోవైపు వైసీపీపై ప్రస్తుతం దళితులకు కోపం ఉంది. కార్పొరేషన్ విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై తిరుపతిలోని దళితులు కోపంతో ఉన్నారు. దళితుల కోసం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినా…. దానికి నిధులను వైసీపీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో.. కార్పొరేషన్ ఉండి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే.. తిరుపతిలో వైసీపీకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.