Train : మీకు ట్రైన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌క తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Train : మీకు ట్రైన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌క తెలుసుకోండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Train : మీకు ట్రైన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Train : భార‌తీయ రైల్‌లో నిత్యం ల‌క్ష‌ల కొల‌ది ప్ర‌యాణిస్తుంటారు. ట్రైన్ జ‌ర్నీ సుల‌భ‌త‌రంగాను, హాయిగా ఉంటుంది. త‌క్కువ ఖ‌ర్చుతో గ‌మ్య స్థానాల‌కి చేరుకుంటారు. అయితే రైల్వే ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌యాణికుల‌ని అనుగుణంగా అనేక ఆఫ‌ర్స్ తీసుకురావ‌డం, అలానే వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు క‌లిగించ‌డం మ‌నం చూస్తున్నాం. సీనియర్ సిటిజన్లకు, మ‌హిళ‌ల‌కి, విక‌లాంగుల‌కి అయితే ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కోసం రైల్వేలో లోయర్ బెర్త్ బుక్ చేసినా దాన్ని పొందలేని పరిస్థితి ఉంటే అందుకు కొన్ని నిబంధ‌న‌ల‌ని రైల్వే పొందుప‌ర‌చింది.

Train ప్ర‌యాణికుల‌కి గుడ్ న్యూస్..

సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ కొత్త నియ‌మాల‌ని తీసుకొచ్చింది. వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను సీనియ‌ర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం ఎలానో ఐఆర్‌సీటీసీ తెలియజేసింది. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే, మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు అలాట్‌మెంట్ లభిస్తుందని చెప్పుకొచ్చింది. మీరు రిజర్వేషన్ ఛాయిస్ కింద బుక్ చేసుకుంటే మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది.

Train మీకు ట్రైన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌క తెలుసుకోండి

Train : మీకు ట్రైన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధ‌న‌లు త‌ప్ప‌క తెలుసుకోండి..!

సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలియ‌జేసింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉండ‌నున్న‌ట‌టు తెలియ‌జేసింది. జనరల్ కోటాలో సీటు రావడంలో మానవ జోక్యం లేదు. అయితే, మీరు లోయర్ బెర్త్ కోసం అయితే టీటీఈని సంప్ర‌దించే అవ‌కాశం ఉంది. అలాగే మీ కోసం లోయర్ బెర్త్ కోసం ఆయ‌న సాయం తీసుకోవ‌చ్చు. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే అది మీకు త‌ప్ప‌క ల‌భిస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది