Tree Isolation : చెట్టు మీదనే ఐసోలేషన్.. ఓ యువకుడి వింత ఆలోచన.. మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tree Isolation : చెట్టు మీదనే ఐసోలేషన్.. ఓ యువకుడి వింత ఆలోచన.. మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 May 2021,10:53 am

Tree Isolation : ట్రీ ఐసోలేషన్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? హోం ఐసోలేషన్ అని విన్నాం కానీ ఈ ట్రీ ఐసోలేషన్ ఏంటో మాకు తెలియదు అని అంటారా? అవును.. హోం ఐసోలేషన్ అంటే ఏంటి? ఇంట్లో ఉండి ఐసోలేట్ అయిపోవడం.. అంటే ఇంట్లోనే ఓ మూలన ఓ రూమ్ లో ఒంటరిగా కొన్ని రోజుల పాటు ఉండటం. దాన్నే ఇప్పుడు మనం కరోనా వస్తే.. హోం ఐసోలేషన్ అంటున్నాం. అయితే.. ట్రీ ఐసోలేషన్ అంటే చెట్టు మీదకు ఎక్కడి అక్కడే ఉండటం అన్నమాట. ఇదోరకమైన ఐసోలేషన్. ఈ ట్రెండ్ ను కొత్తగా తెలంగాణలో కనిపెట్టారు.

tree isolation in nalgonda district of telangana

tree isolation in nalgonda district of telangana

తెలంగాణలోని నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కోతనందికొండ గ్రామానికి చెందిన శివ అనే యువకుడికి ఇటీవల కరోనా సోకింది. దీంతో తను చాలా ఆందోళన చెందాడు. తన వల్ల తన కుటుంబ సభ్యులకు కూడా ఎక్కడ కరోనా వస్తుందోనని భయపడ్డాడు. ఇంట్లో ఉందామంటే.. చూస్తే.. ఇల్లు పెద్దది కాదు.. చిన్న ఇల్లు.. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకునేంత స్థోమత లేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న శివ… వెంటనే తన ఇంటి ముందు ఉన్న చెట్టు ఎక్కి అక్కడే మంచం సెట్ చేసుకొని.. తను ఓ 15 రోజుల పాటు చెట్టు మీదే ఉండేలా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అది చూసి తండా వాసులు విస్తుపోయారు.

Tree Isolation : గత 10 రోజుల నుంచి తిండి, నిద్ర అన్నీ చెట్టు మీదనే

గత 10 రోజుల నుంచి శివ… చెట్టు మీదనే నివాసం ఉంటున్నాడు. తిండి కూడా అక్కడే. రాత్రి నిద్ర కూడా అక్కడే. శివకు కావాల్సిన వాటిని తన కుటుంబ సభ్యులు చెట్టు మీదకి పంపిస్తుంటారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి.. చివరకు చుట్టుపక్కన గ్రామాల జనాలు కూడా శివను చూడటానికి వస్తున్నారట. భలే విచిత్రంగా చెట్టు మీద ఐసోలేట్ అయ్యాడు. ఐడియా బాగుంది అంటూ శివను అందరూ మెచ్చుకుంటున్నారట. ఈరోజుల్లో కరోనా వస్తే.. ఆసుపత్రుల్లోకి వెళ్లి లక్షలు లక్షలు తగలెయ్యాల్సిన పరిస్థితి నెలకొన్నది. అందుకే.. ఇంట్లో ఉండలేక.. చెట్టు మీద ఉండి.. కరోనా నయం అయ్యే దాకా ఎలాగోలా ఇక్కడే ఉంటా.. అని శివ చెబుతున్నాడు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది