Triple murder: ఘోరం.. 15 నిమిషాలు, మూడు హ‌త్య‌లు.. ఉలిక్కిప‌డిన వ‌రంగ‌ల్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Triple murder: ఘోరం.. 15 నిమిషాలు, మూడు హ‌త్య‌లు.. ఉలిక్కిప‌డిన వ‌రంగ‌ల్‌..!

Triple murder: అర్ధ‌రాత్రి ఓ ఇంట్లో దారుణం..! సొంత సోద‌రుడి ఇంట్లోనే ర‌క్త‌పాతం సృష్టించిన త‌మ్ముడు. స్నేహితుల సాయంతో 15 నిమిషాల మార‌ణ‌హోమం..! పదునైన వేటకొడవళ్లు, ఎలక్ట్రిక్‌ రంపంతో ఊచ‌కోత‌..! మూడు హ‌త్య‌లు..! ప్రాణాపాయ స్థితిలో మ‌రో ఇద్ద‌రు..! వరంగల్ నగరంలోని ఎల్‌బీనగర్‌లో గురువారం తెల్లవారుజామున ఈ మార‌ణ‌కాండ వెలుగుచూసింది. దాంతో వ‌రంగ‌ల్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. చాంద్‌ పాషా (50), అతడి భార్య సాబీరా (42), బావమరిది ఖలీల్ (40)ల‌ను నిందితుడు ష‌ఫీ త‌న స్నేహితుల‌తో క‌లిసి […]

 Authored By nagaraju | The Telugu News | Updated on :2 September 2021,8:29 pm

Triple murder: అర్ధ‌రాత్రి ఓ ఇంట్లో దారుణం..! సొంత సోద‌రుడి ఇంట్లోనే ర‌క్త‌పాతం సృష్టించిన త‌మ్ముడు. స్నేహితుల సాయంతో 15 నిమిషాల మార‌ణ‌హోమం..! పదునైన వేటకొడవళ్లు, ఎలక్ట్రిక్‌ రంపంతో ఊచ‌కోత‌..! మూడు హ‌త్య‌లు..! ప్రాణాపాయ స్థితిలో మ‌రో ఇద్ద‌రు..! వరంగల్ నగరంలోని ఎల్‌బీనగర్‌లో గురువారం తెల్లవారుజామున ఈ మార‌ణ‌కాండ వెలుగుచూసింది. దాంతో వ‌రంగ‌ల్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.

చాంద్‌ పాషా (50), అతడి భార్య సాబీరా (42), బావమరిది ఖలీల్ (40)ల‌ను నిందితుడు ష‌ఫీ త‌న స్నేహితుల‌తో క‌లిసి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే హతమార్చాడు. తెల్లవారుజామున 2.20 నుంచి 2.35 మ‌ధ్య ఆ మూడు హత్యలు జరిగాయి. తండ్రిపై క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి హ‌త్య‌, అడ్డుకోబోయిన మేన‌మామ ఖ‌లీల్ మెడ‌పై ఎల‌క్ట్రిక్‌ రంపంతో కోసి హ‌త్య‌, వారి అరుపులు విని లేచి వ‌చ్చిన త‌ల్లి సాబిరా గొంతుకోసి హ‌త్య‌, ఆ త‌ర్వాత ప‌రుగున వ‌చ్చిన త‌మ్ముళ్లు స‌మ‌ద్ (21), ఫ‌హాద్ (28)ల‌పై క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి.. బాబాయ్ చేసిన ఈ దారుణ మార‌ణ‌హోమానికి చాంద్‌పాషా కుమార్తె రూబినా ప్ర‌త్య‌క్ష సాక్షిగా మిగిలింది.

Triple murder: వ్యాపారంలో న‌ష్టాలే హ‌త్య‌ల‌కు కార‌ణం..

వివ‌రాల్లోకి వెళ్తే.. చాంద్‌పాషా, షఫీ ఇద్ద‌రూ అన్నదమ్ములు. 20 ఏండ్లుగా పశువుల క్రయ విక్రయాలు చేస్తూ గొడ్డు మాంసం వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. మూడేండ్ల‌ క్రితం వ్యాపారంలో సుమారు రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఇందులో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్‌పాషా భరించాలని పెద్ద‌ల స‌మ‌క్షంలో నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. రెండు మూడుసార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగినా.. వ్యాపార లావాదేవీలు షఫీ చూసేవాడని, ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ష‌ఫీ అప్పు కట్టాల్సిందేన‌ని చాంద్‌పాషా చెప్పుకొచ్చాడు.

అయితే, ఏడాది క్రితం ఎల్‌బీనగర్‌లో సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్‌పాషా కొత్త ఇంటిని నిర్మించాడు. దాంతో అన్న తనకు ఎక్కువ‌ అప్పులు వేసి, తను మాత్రం డబ్బులు లేవంటూనే కోటి రూపాయలతో కొత్త ఇల్లు కట్టుకోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాడు. తనను మోసం చేసి డబ్బులు మిగుల్చుకున్నాడని కోపం పెంచుకున్నాడు. తనకు అప్పుల భారం తీవ్రమైందని, ఆదుకోవాలని అన్నావదినలను కోరినా వారు వినకపోవడంతో అత‌నిలో కోపం కాస్త కసిగా మారి హత్యల‌కు దారి తీసింది.

Triple murder: ష‌ఫీకి స‌హ‌క‌రించిన స్నేహితులు..

చాంద్‌పాషా, సాబీరా, ఖలీల్‌లను హ‌త్య చేసిన త‌ర్వాత చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు అక్క‌డికి వచ్చారు. దాంతో వాళ్ల‌ను కూడా ష‌ఫీ, అత‌ని స్నేహితులు విచక్షణారహితంగా పొడిచారు. దాంతో వాళ్లు రక్తపు మడుగులో పడగా చనిపోయారని భావించి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత‌ వారిలో చలనం ఉండడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Triple murder: క్ష‌ణాల్లో ముగ్గురు మృతి..

దుండగులు కత్తులతోపాటు దాడిలో రంపాన్ని వినియోగించడం వల్ల ఆ ముగ్గురు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. చాంద్‌పాషా మెడను రంపంతో కోశారు. భుజాలు, చేతులపై పదునైన కత్తిపోట్లు ఉన్నాయి. మెడ భాగం పూర్తిగా తెగిపోయింది. ముఖంపై పడిన కత్తిపోటుతో ముక్కు వరకు తెగింది. ఖలీల్‌పాషాకు గొంతు దగ్గర రంపంతో కోశారు. సాబీరా బేగం ముఖంపై పదునైన కత్తిపోటు పడింది. ముగ్గురి మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రి లో పోస్టుమార్టం నిర్వహించా రు. చాంద్‌పాషా కూతురు రూబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ దగ్గు మల్లేష్‌ తెలిపారు.

Triple murder: మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు..

ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమద్, ఫహాద్‌ల‌ను సోదరి రూబీనా బేగం స్థానికులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్క‌డి ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం మెరుగైన వైద్యం కోసం వారిని ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తరలించారు.

 

nagaraju

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది