Bandi Sanjay : ఇది దెబ్బ అంటే.. బండి సంజయ్ కోలుకోలేని దెబ్బ తీసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?
Bandi Sanjay : తెలంగాణలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు బండి సంజయ్. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎంపీగా గెలవడంతో పాటు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీలో కీరోల్ పోషిస్తున్నారు. ఆయన మాట్లాడేతత్వం కానీ.. ఎదుటి వారు ఎంతటి వారు అయినా సరే.. ఆయన విమర్శించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వెనకా ముందు చూడకుండా.. ముఖ్యమంత్రినైనా సరే.. డైరెక్ట్ గా విమర్శించగలరు సంజయ్. అందుకే.. ఆయనపై తెలంగాణలో ఎక్కువ దృష్టి పడింది.
ఇప్పటికే చాలాసార్లు బండి సంజయ్.. టీఆర్ఎస్ నేతలను, సీఎం కేసీఆర్ ఇష్టమున్నట్టు తిట్టారని.. నోటికొచ్చినట్టు మాట్లాడారని.. టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై కూడా విరుచుకుపడ్డారని టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
దళితుల పట్ల చిన్నచూపు చూస్తూ.. వాళ్లను అవమానిస్తున్నట్టు మాట్లాడటంపై బండి సంజయ్ పై టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు.
Bandi Sanjay : దళితులు నీకు చెప్పులు కుట్టుకునే వాళ్లగానే కనిపిస్తున్నారా?
బండి సంజయ్ ఏం మాట్లాడుతడో ఆయనకే తెలియదు. తలాతోకా లేకుండా మాట్లాడి.. బండి సంజయ్ అంటే ఇంతే అనే ఒక ముద్ర వేయించకొని.. ఇప్పుడు ఎవరూ దొరకలేదని.. దళితులపై పడ్డాడు బండి సంజయ్. దళితులంటే ఆయనకు కేవలం చెప్పులు కుట్టుకునే వారిగానూ.. లేదంటే మొలలు కుట్టుకునే వారిగానే కనబడుతున్నారు. వాళ్లు అక్కడే ఉండిపోవాలని బండి సంజయ్ కోరుకుంటున్నాడు. కానీ.. ఆయనకు తెలియని విషయం ఏంటంటే.. దళితులు అన్ని రంగాల్లో ముందున్నారు. అందరితో పోటీ పడుతున్నారు. వాళ్లు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆ విషయం బండి సంజయ్ కి తెలియదు. దళితులు తలుచుకుంటే బండి సంజయ్ కి దిక్కుదివానా ఉండదు. దళితులపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండి సంజయ్ కి బహిరంగ లేఖ రాశారు.
ప్రస్తుతం తెలంగాణలో ఈ లేఖ గురించే తెగ చర్చ సాగుతోంది. బండి సంజయ్ కి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన స్ట్రాంగ్ స్ట్రోక్ తో ఇకనైనా బండి సంజయ్ కాస్త దిగివస్తారా? లేక ఇంకా రెచ్చిపోతారా? అనేది వేచి చూడాల్సిందే.