Sagar by poll : సాగర్ లో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ? వాళ్లపైనే గురి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sagar by poll : సాగర్ లో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ? వాళ్లపైనే గురి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 April 2021,11:00 am

Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక హడావుడి నడుస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలవాలని పలు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే దుబ్బాక సీటును కోల్పోవడంతో.. మరోసారి అలా జరగకూడదని యోచిస్తోంది. అందుకే… ఎలాగైనా సాగర్ ను కూడా దక్కించుకొని తమ పార్టీ సత్తాను చాటాలని భావిస్తోంది. అందుకే…. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పలు అస్త్రాలను ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ వదులుతోంది. ముఖ్యంగా సాగర్ లో బీజేపీ గెలవకూడదని వ్యూహాలను రచిస్తోంది. దాని కోసమే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది… అంటూ జోరుగా చర్చ సాగుతోంది.

trs operation akarsh in sagar by poll

trs operation akarsh in sagar by poll

నాగార్జునసాగర్ లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పాగా వేసి అక్కడే ఉంటూ… టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్టు తెలుస్తోంది. వేరే పార్టీలకు చెందిన పలువురు నేతలను పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మండల, గ్రామ స్థాయిలోని నాయకులకు ప్యాకేజీలు, పదవుల ఆశ చూపి… పార్టీలో చేర్చుకుంటోందని సమాచారం. అందుకే… గత రెండు మూడు రోజుల నుంచి సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కూడా పెరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సాగర్ లో టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినప్పటికీ… టీఆర్ఎస్ పార్టీ తన దృష్టి మొత్తాన్ని బీజేపీపైన కేంద్రీకరించిందట. బీజేపీకి సాగర్ నియోజకవర్గంలో క్యాడర్ లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట.

అందుకే… సాగర్ లో టికెట్ ఆశించి భంగపడిన కొందరు బీజేపీ లీడర్లతో బేరసారాలు మాట్లాడుతున్నారట టీఆర్ఎస్ నేతలు. వాళ్లకు హైకమాండ్ కూడా మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా.. బీజేపీలోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకుంటే.. బీజేపీ తరుపున ప్రచారం చేయడానికి కూడా ఎవరూ ఉండరనేది టీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.

Sagar by poll : జానారెడ్డి అనుచరులను కూడా టార్గెట్ చేసిన టీఆర్ఎస్?

బీజేపీతో పాటు… కాంగ్రెస్ నేతలను కూడా టీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీదారుడు జానారెడ్డి నుంచి కాస్త పోటీ ఉండటం వల్ల.. జానారెడ్డి అనుచరులపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసిందట. జానారెడ్డితో పాటు మొదటి నుంచి ఉంటున్న నేతలపై గురి పెట్టి… వాళ్లను పార్టీలోకి లాక్కోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలను బెదిరించో… ప్యాకేజీ ఆశ చూపించో… ఇంకేదో చేసో పార్టీలో చేర్చుకుంటున్నారని… కాంగ్రెస్ నేతలు కూడా వాపోతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది