Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన టిఆర్ఎస్..!!
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ మొదటి కొన్ని రౌండ్స్ మినహా మిగతా రౌండ్స్ అన్నిటిలో దూసుకుపోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 మెజారిటీతో గెలిచారు. దీంతో టిఆర్ఎస్ నేతలు..కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలతో కలిసి డాన్స్ వేశారు.టిఆర్ఎస్ పార్టీ గెలుపుతో మునుగోడు వాసులు ఆనందం వ్యక్తం చేసుకుంటున్నారు.
ఎందుకంటే ఈ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. స్వయంగా మంత్రి కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో కచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. దీంతో 2018 నుంచి జరిగిన ఏ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాట లేకపోయింది.ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల జాప్యం పై బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బందిని ఇబ్బందులు పాలు పెట్టే ప్రయత్నాలు కూడా చేసినట్లు పేర్కొన్నారు.
ఎమ్మార్వో మరియు ఎంపీడీవోలతో స్వయంగా సీఎం మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాగా బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు..నైతికంగా తానే గెలిచినట్లు చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో గెలవడంతో పార్టీ కార్యకర్తలు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.