Snacks : మిగిలిపోయిన ఇడ్లీతో ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ ఈ విధంగా చేసి చూడండి…
Snacks : ఉదయం టిఫిన్ గా చేసుకున్న ఇడ్లీ తినగా ఒక్కొక్క మారు మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఇడ్లీల్ని పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఆ ఇడ్లీతో స్నాక్ చేసుకోవడం ఎలాగో ఎప్పుడూ చూద్దాం. కావలసిన పదార్థాలు : ఇడ్లీలు, కారం, పెరుగు, పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొత్తిమీర, పచ్చిమిర్చి,కరివేపాకు, ఆవాలు, అల్లం, ఎల్లిపాయలు, మొదలైనవి.
తయారీ విధానం : ముందుగా ఇడ్లీలను తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని, వాటిలో ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, అరకప్పు పెరుగు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
తర్వాత దానిలో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్, వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి గ్రేవీ వచ్చేలా చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను దానిలో వేసి కొద్దిసేపు వేయించుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి. అంతే మిగిలిపోయిన ఇడ్లీతో స్నాక్స్ ఎంతో ఈజీగా రెడీ.