Junk Food : వామ్మో… వీటిని తింటున్నారా..? అయితే యమలోకానికి టికెట్ కొనుక్కున్నట్టే…!
ప్రధానాంశాలు:
Junk Food : వామ్మో... వీటిని తింటున్నారా..? అయితే యమలోకానికి టికెట్ కొనుక్కున్నట్టే...!
Junk Food : మనం జీవిస్తున్న ఈ జీవన విధానంలో ఆహారపు అలవాట్ల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాము.ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు మనల్ని ఎంతగానో వేధిస్తున్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.తాజాగా ఓ అధ్యయనం తీసుకున్న ఆహారపు విషయంలో ఎన్నో హెచ్చరికలు జారీ చేశారు. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్డులో 32 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పరిశోధనలో తెలిపారు.క్యాన్సర్,టైప్ -2 మధుమేహం,గుండె జబ్బులు మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.అకాల మరణం లాంటిఎన్నో తీవ్రమైన వ్యాధులు కూడా ఉన్నాయి..ఈ పరిశోధనలో ఇది ఎంతో వివరణాత్మక అధ్యయనం. దీనితో ప్రపంచం మొత్తం మీద ఎన్నో పరిశోధన చేసి వీటి డేటాను తీశారు.
ప్రపంచంలో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా పెరుగుతున్న సమయంలో పరిశోధనా ఫలితాలు బయటకు వచ్చాయి. దీనిలో క్వాన్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రోటీన్ బార్స్, రెడీ -టు – ఈట్ మిల్స్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అమెరికా బ్రిటన్ లోని ప్రజలు ఎక్కువ ఆహారం వాళ్లు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ సగం కంటే ఎక్కువగానే ఉంది.ప్రత్యేకంగా పేదలు,యువకులు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలు తినే ఆహారంలో 80% వరకు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఉందని చెప్పారు.పరిశోధనలో తేలింది ఏంటంటే..BMJ మ్యాగజైన్ పరిశోధన ఫలితాల ప్రకారం అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే ఆహార ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అంశాలకు హానికరం అని చెప్పింది. దాదాపు పది మిలియన్ల మంది దీని గురించి చెప్పారు.అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవటంఅనేది తగ్గించేందుకు ఎన్నో చర్యలు అవసరం అని పరిశోధకులు చెబుతున్నారు.
అల్ట్రా ప్రాసెస్ ఫుడ్..అల్ట్రా ప్రాసెస్ ఆహారంలో ప్యాక్ చేసిన స్నాక్స్, పీజీ డ్రింక్స్, కాల్చిన వస్తువులు, చక్కెర తృణ ధాన్యాలు, సిద్ధంగా ఉన్న భోజనాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. వాటిని అనేక పారిశ్రామిక ప్రక్రియ వలన ఉంచబడ్డాయి. ఈ ఉత్పత్తులు చక్కెర,కొవ్వు ఇంకా ఉప్పులో అధికంగా ఉన్నాయి.వీటిలో విటమిన్స్ ఫైబర్స్ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.వీటిలో రంగులు ఎమ్మెల్సీ ఫైయింగ్ ఏజెంట్లు, రుచులు సంకలితాలను కలిగి ఉంటాయి. వీటిపై మరింతగా పరిశోధనలు జరగాలని నిపుణులు చెప్తున్నారు
పరిశోధన ముగింపు..అమెరికాకు చెందిన జాన్స్ హప్ కింగ్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్రాన్స్ కు చెందినా సోర్బల్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయలోని ఎంతోమంది నిపుణులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. అల్ట్రా ఫాస్సెస్ ఫుడ్ వలన క్యాన్సర్,మానసిక, శ్వాసకోశ, మరణాలు, జీర్ణాశయంతర జీవక్రియ వంటి వాటితో 32 రకాల ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉందని పరిశోధనా నిపుణులు తెలియజేశారు.