Tspsc Jobs : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ నోటిఫికేషన్ ను విడుదల చేసిన TSPSC
tspsc : తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన ఇటీవలే అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే 50 వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఇప్పటికే గుర్తించడంతో పాటు భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 50 వేల ఉద్యోగాల్లో మొదటగా పీవీ నరసింహా రావు మరియు జయశంకర్ యూనివర్శిటీల్లో పలు పోస్టులకు సంబంధించిన […]
tspsc : తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన ఇటీవలే అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే 50 వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఇప్పటికే గుర్తించడంతో పాటు భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 50 వేల ఉద్యోగాల్లో మొదటగా పీవీ నరసింహా రావు మరియు జయశంకర్ యూనివర్శిటీల్లో పలు పోస్టులకు సంబంధించిన ఖాళీలను నింపేందుకు గాను TSPSC నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది.
ఈ రెండు యూనివర్శిటీల్లో ఉన్న మొత్తం ఖాళీలను గుర్తించినట్లుగా పేర్కొన్న అధికారులు భర్తీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే ఆర్థిక శాఖ నుండి అనుమతులు రావడంతో మొత్తం పక్రియ మొదలు అయ్యింది. ఈ రెండు యూనివర్శిటీల్లో కలిపి 127 పోస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం పోస్ట్ లకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ రిజర్వేషన్ ఇలా అన్ని రకాల వివరాలను ఇవ్వడం జరిగింది. అర్హులు అయిన వారు ఈ ఉద్యోగాల కోసం TSPSC అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
tspsc : 127 పోస్టులు ఏ మూలుకు వస్తాయి
లక్షల్లో ఉన్న నిరుద్యోగులకు 127 పోస్టులు ఏ మూలుకు వస్తాయి. కనీసం 50 వేల పోస్టులు వేసినా కూడా కొంతలో కొంత మందికి అయినా సంతృప్తి కలుగుతుంది కదా అనేది కొందరి వాదన. ప్రస్తుతం నాగార్జున సాగర్ హడావుడి ఉన్న కారణంగా నోటిఫికేషన్ లు సాధ్యం కావడం లేదని అందుకే వచ్చే నెలలో ఎన్నికల కోడ్ పోయిన వెంటనే నోటిఫికేషన్ లు వేస్తామంట ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చింది. ఈలోపు ఈ జాబ్ లకు మీరు అర్హులు అయితే ప్రయత్నించండి మరి..!