Tsrtc : టీఎస్ ఆర్టీసీ శుభవార్త : దానికి అదనపు ఛార్జీలు లేవు..!
Tsrtc : తెలంగాణ ఆర్టీసీ… బస్సు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగల నేపథ్యం వచ్చే సంక్రాంతికి నడిపే బస్సులకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పండుగల సమయంలో ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా.. ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ.
హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు కేవలం పండుగల సమయాన.. 4 వేల 318 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని ఇటీవల ప్రకటించింది. ఇప్పుడా బస్సులకు అదనపు చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్ సుక్ నగర్, సీబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీ హెచ్ బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట నుంచి బస్సులు నడుపుతున్నట్టు చెప్పింది.
అయితే వీటితో పాటు ఈసారీ ఏపీ కి కూడా టీఎస్ ఆర్టీసీ బస్సులను నడపనుంది. వీటిపై పూర్తి వివరాలతో పాటు, టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలంటే.. https://www.tsrtconline.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.