ఈ ఆకు రసం ప్రకృతి ఇచ్చిన వరం… ఈ ఆకు రసం తాగితే కరోనా పరార్?
నిజానికి ప్రకృతి మనకు దేవుడిచ్చిన వరం. ప్రకృతే లేకపోతే మనిషి అనేవాడే ఈ భూమ్మీద ఉండేవాడు కాదు. గతంలో మన తాతలు, ముత్తాతల కాలంలో ఆసుపత్రులే లేవు. అసలు ఇంగ్లీష్ మందులే లేవు. అన్నీ నాటు మందులే. ప్రకృతి వైద్యమే. ఏం జరిగినా… ఏ వ్యాధి వచ్చినా… ప్రకృతి వైద్యమే చేసేవాళ్లు. అప్పట్లే ప్రకృతి వైద్యం బాగానే పనిచేసేది. ఏ రకమైన రోగమైనా చెట్ల మందుతో తగ్గించేవాళ్లు. కానీ… కాలం మారింది. కాలంతో పాటు మనుషులు మారారు. మనిషి రోగాలు ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయాయి. కార్పొరేటు ఆసుపత్రులు వెలిశాయి. ఇంగ్లీష్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయినా కూడా మన తాతల వైద్యం తాతల వైద్యమే. దాన్ని మించింది లేదు. ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి వైద్యాన్ని పాటిస్తున్నవాళ్లు కోకొల్లలు.
మన చుట్టూ ఉన్న చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కానీ… అవి మనకు తెలియదు. ఏదో పిచ్చి మొక్క అని అనుకుంటాం కానీ.. ఆ పిచ్చి మొక్కలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అనే విషయం తెలియదు. అంతెందుకు… ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేదంలో కూడా ట్రీట్ మెంట్ ఉంది. మన అందరి ఇంట్లో ఉండే ఓ ఆకుతో కరోనాను దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా?
ఆ ఆకు మరేదో కాదు.. రోజూ మనం పూజ చేసే తులసి ఆకు. అవును.. తులసి ఆకులో ఉండే ఔషధ గుణాలు మరే ఆకులో ఉండవు. తులసి ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే… ప్రతి ఇంట్లో తులసి చెట్టును పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ మెడిసిన్.. తులసి
చాలామందికి ఇమ్యూనిటీ సమస్యలు వస్తున్నాయి. ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కరోనా అటాక్ చేస్తోంది. అదే ఇమ్యూనిటీ శరీరానికి సరిపడా ఉంటే.. కరోనా కాదు కదా… దాని అమ్మ కూడా అటాక్ చేయలేదు. అందుకే… నిత్యం తులసి ఆకులను తింటూ ఉంటే.. ఆకులను రసం చేసుకొని తాగుతూ ఉంటే.. శరీరంలో ఒక్కసారిగా ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కనీసం ఒక 10 తులసి ఆకులను తీసుకొని… వాటిని ఓ కప్పులో వేసి అందులో కొన్ని నీళ్లు పోసి… కొన్ని లవంగాలను అందులో వేసి… కొంచెం సేపు ఆ నీళ్లను వేడి చేసి.. ఆ తర్వాత వడ కట్టి తాగాలి. దాని వల్ల దగ్గు, జలుబు లాంటి సమస్యలు తగ్గడంతో పాటు… రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే.. రోజూ ఉదయాన్నే పరిగడపున.. ఓ ఐదారు తులసి ఆకులను నమిలి మింగేయాలి. దాని వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజూ చేయడం వల్ల.. శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి కరోనా దరికి కూడా రాదు.