Crying : మనం ఏడిస్తే మొదటిగా ఏ కంటి నుండి నీళ్లు వస్తాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crying : మనం ఏడిస్తే మొదటిగా ఏ కంటి నుండి నీళ్లు వస్తాయో తెలుసా…?

 Authored By anusha | The Telugu News | Updated on :29 June 2022,10:00 pm

Crying : ప్రతి మనిషికి ఏడుపు అనేది సహజం. ఒక వ్యక్తికి బాధ వచ్చిన, సంతోషం వచ్చినా, కోపం వచ్చినా కండ్ల నుండి నీళ్లు కారుతాయి. కొందరు బయటకి ఏడుస్తారు, అంటే ఎంత మంది ముందు ఉన్న బాధ వస్తే ఏడుస్తారు. మరికొందరు లోలోపల ఏడుస్తారు అంటే ఎదురుగా ఎవరైనా ఉన్నప్పుడు ఏడవడానికి ఇష్టపడరు. వారు తమ బాధను బయటికి చెప్పకుండా లోలోపల ఏడ్చేస్తుంటారు. ఎందుకంటే అవతలి వారి ముందు ఏడిస్తే బలహీనులు అవుతారని కొందరు ఏడవరు. అందుకే వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారు. కొందరు ప్రతి చిన్న విషయాన్ని కూడా అవతలి వారితో పంచుకొని ఏడుస్తారు. ఇలా చేయడం వలన వారి బాధ కొద్దిగా తగ్గుతుందని అనుకుంటారు. అందుకే ఎంతమంది ఉన్నా తమకు బాధ వస్తే అందరి ముందే ఏడ్చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఉంటారు.

అయితే కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీరు బాధ వలన వస్తుందని అనుకోలేం. ఇది చాలా మందికి తెలుసు. కొందరు బాధగా ఉన్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఆ సంతోషాన్ని తట్టుకోలేక కన్నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఆ సమయంలో వారికి ఏడుపు తో పాటు నువ్వు కూడా వస్తుంది. అలాగే కొందరికి కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో అవతల వారిని తిట్టుకుంటూ తనని ఇలా చేసినందుకు బాధపడుతూ తిడుతూ ఏడుస్తారు. కన్నీళ్లు ఒక ఎమోషన్స్ కి మాత్రమే చెందినవి కావు. కన్నీళ్లు ఒక మనిషి బాధగా ఉన్నప్పుడు వస్తాయి, సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి, కోపం తో ఉన్నప్పుడు వస్తాయి. అయితే ముందుగా ఏ ఏమోషన్ వలన ఏ కంటి నుండి కన్నీళ్లు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Types of Crying and its meaning

Types of Crying and its meaning

ఒక మనిషి తను ఏ విషయం గురించైనా బాధపడుతున్నప్పుడు మొదటిగా వారి ఎడమ కంటి నుంచి కన్నీళ్లు కారుతాయి. అదే ఒక మనిషి పట్టరాని ఆనందంతో ఉన్నప్పుడు మొదటిగా కుడి కంటి నుండి నీళ్లు కారుతాయి. వీటినే ఆనందభాష్పాలు అంటారు. ఏదైనా విషయం వారికి సంతోషాన్ని కలిగిస్తే, అది అంతులేని ఆనందం అయితే కంటి నుండి ఆనందభాష్పాలు వస్తాయి. అలాగే ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు రెండు కళ్ళ నుండి నీళ్లు కారుతాయి. ఇలా సందర్భానికి తగ్గట్టుగా కంటి నుండి వచ్చే కన్నీరు ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇలా కన్నీళ్లు కూడా వేరువేరుగా వస్తాయి అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఏడ్చేటప్పుడు ఏ కంటి నుండి కనీళ్లు వస్తున్నాయి అని అవన్నీ గమనించరు కనుక.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది