Crying : ఏడ్వడం వల్ల ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే.. మీరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు..!
Crying : ఏడుపు.. ఇది చాలామందికి చెడు సంకేతం. ఎవరైనా ఏడిస్తే చాలు.. ఏడుపుగొట్టు మొహం వేసుకొని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు.. అంటూ హేళన చేస్తుంటారు. ఎవరైనా ఏడిస్తే చాలు. ఏడ్వకు మంచిది కాదు అంటారు పెద్దలు. కానీ.. మీకో విషయం తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు వద్దన్నా కూడా ఏడుస్తారు. ఎవ్వరు ఏడవవద్దు.. అన్నా కూడా ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే.. ఏడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో తెలుసుకుందాం రండి.
చాలామంది నవ్వడం ఆరోగ్యానికి మంచిది అంటారు. నిజమే.. నవ్వడం ఆరోగ్యానికి మంచిదే. కానీ.. ఏడవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనట. ఏడవడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే.. ఏం చేస్తారంటే.. ఇప్పటి నుంచి ఏడవడం అలవాటు చేసుకోండి. ఏడుపు రాకున్నా.. ఏడవండి. కనీసం వారానికి ఒకసారి అయినా ఏడవడం నేర్చుకోండి.
Crying : ఏడ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
ఏడుపు స్టార్ట్ చేయగానే ముందుగా మనకు ఏం జరుగుతుంది. కళ్లలో నుంచి నీళ్లు టపాటపా కారుతాయి. వాటినే కన్నీళ్లు అంటాం. వాటిని ఎప్పుడైనా మీరు టచ్ చేసి చూశారా? అవి ఎంతో వేడిగా ఉంటాయి. ఆ కన్నీళ్లు శరీరంలో ఉన్న వేడిని బయటికి పంపిస్తాయి. అలాగే.. కళ్లలో ఉన్న మలినాలను అవి కన్నీటి ద్వారా బయటికి పంపిస్తాయి. అలాగే.. కన్నీళ్లలో ఐసోజైమ్ అనే పదార్థం ఉంటుంది. అది.. పలు రకాల బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఏడవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందట. హైబీపీ కానీ.. లోబీపీ కానీ రాదట. బీపీ కంట్రోల్ లో ఉంటే.. ఎటువంటి గుండె సమస్యలు కూడా రావు. కొందరైతే గంటలు గంటలు ఏడుస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల… కళ్ల నుంచి ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి.
డిప్రెషన్ ఉన్నా, ఆందోళన ఉన్నా.. ఒక్కసారి ఏడిస్తే.. అవన్నీ మటుమాయం అవుతాయట. అలాగే.. కన్నీళ్లు కంటికి ఒక ఎక్సర్ సైజ్ లా పనిచేస్తాయట. అలాగే.. ఏడిస్తే మనసులో ఉన్న బాధ కూడా తగ్గిపోతుంది. అందుకే.. ఏడుపు వస్తే ఏడ్చేయండి. అంతే కాని.. ఏడ్వడం మాత్రం ఆపకండి.