KCR : కేసీఆర్ ఒక పనిమీద వెళ్తే.. మహా సీఎం ఇలా అన్నాడేంటి?
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ మూడవ ఫ్రంట్ కోసం మళ్లీ ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మూడో ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఈసారి కూడా కేసీఆర్ అలా వదిలేస్తారా లేదంటే కచ్చితంగా మూడో ఫ్రంట్ ను తీసుకు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ను కేసీఆర్ కలవడం జరిగింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరియు టీ సీఎం కేసీఆర్ ల యొక్క మీటింగ్ జాతీయ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు.
శరత్ పవార్ మరియు ఉద్ధవ్ థాకరే ల తో మీటింగ్ తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతారని అంతా భావించారు. కానీ కేసీఆర్ మాట్లాడకపోవడంతో మీడియా వర్గాలలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో చాలా మంది ఉద్ధవ్ థాకరే మరియు శరత్ పవార్ మూడవ ఫ్రంట్ విషయం పై విముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మూడవ ఫ్రంట్ అంటే కచ్చితంగా అది బీజేపీకి అనుకూలంగా మారుతుంది అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేశారట. అందుకే కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్దాం అంటూ వారు కేసీఆర్ ని ఆహ్వానించినట్లు గా తెలుస్తోంది. మూడో ఫ్రంట్ విషయమై మాట్లాడడానికి కేసీఆర్ వెళ్తే వారు కాంగ్రెస్ తో కలిసి వెళ్దాం అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
కేసీఆర్ చాలా నమ్మకం పెట్టుకొని మహారాష్ట్ర పోతే ఆ మహారాష్ట్ర సీఎం ఇలా అన్నాడేంటి అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ యొక్క థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు మళ్లీ మొదట్లోనే ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తే అందరికీ మంచిది అన్నట్లుగా ఉద్దవ్ ఠాక్రే మరియు శరద్పవార్ లు ఇద్దరు కూడా కేసీఆర్ తో అన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీ మరియు కాంగ్రెస్ లతో సమాన దూరం ను పాటించాలని భావిస్తున్నాడు. తనకు తానుగా జాతీయ నాయకుడిగా నిరూపించుకునేందుకు ముందు ముందు కేసీఆర్ మరెన్ని ప్రయత్నాలు చేస్తాడో చూడాలి.