UPI Apps : ఫోన్ పే, గూగుల్ పే వాడేప్పుడు జాగ్రత్త.. లేదంటే అంతే సంగతులు..
UPI Apps : ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ డిజిటల్ పేమెంట్స్ కు కూడా మెల్ల మెల్లగా అలవాటు పడ్డారు. ఫిజికల్ గా క్యాష్ చేసే బదులు ఆన్ లైన్ పేమెంట్ చేయడం ఈజీ అని అనుకుంటున్నారు. అందుకుగాను యూపీఐ యాప్స్ ఫోన్ పే కాని గూగుల్ పే కాని పేటీం కాని వాడుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో సైబర్ నేరస్థులు బాగా పెరిగిపోయారు. మనం అప్రమత్తంగా ఉండకపోతే ఈ యూపీఐ యాప్స్ ద్వారా అకౌంట్ లోని డబ్బులను కాజేస్తున్నారు. కాగా, ఈ యాప్స్ వాడేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.సాధారణంగా చాలా మంది చిన్ని విషయమే కదా అని నిర్లక్ష్యం వహిస్తుంటారు.
కానీ, చిన్న చిన్న విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మోస పోవాల్సి వస్తుంది. అది యూపీఐ యాప్స్ యూసేజ్ విషయంలో కంపల్సరీగా వర్తిస్తుంది. సైబర్ సేఫ్టీ టిప్స్ పాటిస్తేనే మోసాలను అడ్డుకోవచ్చు. టెక్నాలజీ యూసేజ్ క్రమంగా బాగా పెరిగిన క్రమంలో లక్షల రూపాయలను ఆన్ లైన్ ట్రాంజాక్షన్స్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అలా ట్రాన్స్ ఫర్ వెరీ ఈజీ అయిపోయింది. కానీ, అంతే స్థాయిలో మోసాలూ పెరిగిపోయాయి. కాబట్టి అప్రమత్తత అవసరం.యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న వారిని సైబర్ నేరగాళ్లు సింపుల్ గా మోసం చేస్తున్నారని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది.
UPI Apps : అప్రమత్తత అవసరం..
లాటరీ తగిలిందంటూ యూపీఐ యాప్స్ లో మెసేజెస్ వస్తాయని, వాటిని చూసి ఆశ పడొద్దని, ఒక వేళ మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసి చూసినట్లయితే మీ ఖాత ఖల్లాస్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేపుడు వారు డబ్బులు యూపీఐ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసినట్లు నమ్మించి, యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపి, తద్వారా మీ పిన్ తెలుసుకుని డబ్బులు కొట్టేస్తారని కాబట్టి అక్కడా జాగ్రత్త అవసరం. మీరు తరచూ యూపీఐ పిన్స్ మారుస్తూ ఉండటం కూడా ముఖ్యం. అలా అయితే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు.