Vaibhav Suryavanshi : 13 ఏళ్ల పిల్లాడిపై కోట్ల వ‌ర్షం.. వ‌య‌స్సు విష‌యంలో పెద్ద ర‌చ్చ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vaibhav Suryavanshi : 13 ఏళ్ల పిల్లాడిపై కోట్ల వ‌ర్షం.. వ‌య‌స్సు విష‌యంలో పెద్ద ర‌చ్చ‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,9:06 pm

ప్రధానాంశాలు:

  •  Vaibhav Suryavanshi : 13 ఏళ్ల పిల్లాడిపై కోట్ల వ‌ర్షం.. వ‌య‌స్సు విష‌యంలో పెద్ద ర‌చ్చ‌..!

Vaibhav Suryavanshi : క్రికెట్‌లో ఐపీఎల్‌కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్య‌మా అని కొత్త క్రికెట‌ర్స్ వెలుగులోకి వ‌స్తుండ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. మ‌రి కొద్ది రోజుల‌లో న్యూ సీజ‌న్ ఐపీఎల్ జ‌ర‌గ‌నుండగా, ఐపీఎల్‌ మెగా వేలం 2025 రికార్డు బద్దలుకొట్టింది. వేలం చరిత్రలోనే ఎవరూ ఊహించని ఘటన జరిగింది. లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరగనివిధంగా అత్యంత పిన్న వయస్కుడు అయిన వైభవ్‌ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. . బీహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అండర్‌-19 టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు వైభవ్ సూర్యవంశీ.

Vaibhav Suryavanshi 13 ఏళ్ల పిల్లాడిపై కోట్ల వ‌ర్షం వ‌య‌స్సు విష‌యంలో పెద్ద ర‌చ్చ‌

Vaibhav Suryavanshi : 13 ఏళ్ల పిల్లాడిపై కోట్ల వ‌ర్షం.. వ‌య‌స్సు విష‌యంలో పెద్ద ర‌చ్చ‌..!

Vaibhav Suryavanshi ఏది నిజం..

ఈ బీహార్ కుర్రాడిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.1.10 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. అత‌డి వ‌య‌స్సు 15 ఏళ్లు అన్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా అత‌డి తండ్రి సంజీవ్ స్పందించాడు. వీటిని కొట్టిపారేశాడు. వైభ‌వ్ వ‌య‌స్సు 13 ఏళ్లే అని తేల్చి చెప్పాడు.ప్ర‌స్తుతం వైభ‌వ్ అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ కోసం దుబాయ్‌లో ఉన్నాడ‌ని అన్నారు. వైభ‌వ్ చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్పారు. 8 ఏళ్ల వ‌య‌సులోనే అండ‌ర్ 16 జిల్లా ట్ర‌య‌ల్స్‌లో అద్భుతంగా ఆడాడ‌ని తెలిపారు. కోచింగ్ కోసం అత‌డిని స‌మ‌స్తిపూర్‌కి తీసుకువెళ్లి, తీసుకువ‌చ్చేవాడిన‌ని అన్నారు. అత‌డు క్రికెట‌ర్‌గా ఎదిగేందుకు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేశానని చెప్పాడు. ఇందుకోసం త‌న భూమిని అమ్మేశాన‌ని, అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టికి కూడా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

ఎడమ చేతివాటం కలిగిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు. ఈ ఏడాదే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీకి దూకుడుగా ఆడతాడనే పేరుంది. ఈ నేపథ్యంలోనే రూ. 30 లక్షలకు వేలంలోకి వచ్చిన అతడిని రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ర‌సీఖ్ దార్ కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. అయితే త‌ప్పుడు బ‌ర్త్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించినందుకు గాను బీసీసీఐ రెండేళ్ల‌పాటు నిషేదం విధించింది. మ‌రి సూర్య‌వంశీలో ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి. vaibhav suryavanshi faces age fraud allegations

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది