Vastu Tips : ఈ పరిహారాలతో జీవిత భాగస్వాముల మధ్య సమస్యలకు పరిష్కారం..
Vastu Tips : ఇంటి లోపల ప్రతీ వస్తువు వాస్తు ప్రకారం ఉండాలని, లేనట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది పలు విషయాల గురించి తెలుసుకునేందుకుగాను జ్యోతిష్య శాస్త్ర పెద్దలు, వాస్తు తెలిసిన వారి వద్దకు వెళ్తుంటారు. వారి సూచనలు పాటించి తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. కాగా, దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలున్నట్లయితే కచ్చితంగా ఇంటి లోపల వాస్తు సమస్యలు ఉండి ఉంటాయని, వాటిని పరిష్కరించుకున్న తర్వాతనే వీరు కలిసి ఉంటారని అంటున్నారు.వాస్తు నిపుణులు చెప్తున్న దాని ప్రకారం..
ఇంటి లోపలి వాస్తు వలన దంపతుల మధ్య తరచూ గొడవలు అవుతుంటాయి. ఈ క్రమంలోనే వాస్తు ప్రకారంగానే ఆ సమస్యలను దంపతులు పరిష్కరించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, వాస్తు ప్రకారం.. ఇంటిలోని బెడ్ రూమ్ లోపల ఈ జాగ్రత్తలు పాటించాలి. వాస్తు ప్రకారం బెడ్ రూంలో అద్దం అస్సలు ఉంచరాదు. నిద్రపోతున్నపుడు అద్దంలో మీ శరీరంలోని ఏ భాగం కూడా కనిపించొద్దు. అలా కనిపించడం వలన భార్యా భర్తల బంధంలో చీలిక వస్తుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. ఒకవేళ బెడ్ రూంలో అద్దం ఉన్నట్లయితే అద్దంపైన క్లాత్ పెట్టి ఉంచాలి.
Vastu Tips : వాస్తు దోషాలతో అనేక సమస్యలు..
బయట నుంచి వచ్చే ఏ వ్యక్తి చూపు అయినా నేరుగా మీ మంచం మీద అస్సలు పడకూడదు. అలా అయితే మీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇంటికి ఉండేటువంటి పడకగదికి ఒకటే ద్వారం ఉండరాదు. దాంతో పాటు ఇంటి లోపలి పడకగదిలో ఉండే అటాచ్‌డ్ బాత్ రూమ్ ఎప్పటికీ మూసే ఉంచాలి. బాత్ రూమ్ ఓపెన్ చేసి ఉంచినట్లయితే ప్రతికూల శక్తులు వస్తాయి. బెడ్ రూమ్‌కు ఒకటే ఒక ద్వారం ఉండేలా జాగ్రత్తపడాలి.ఇంటి లోపలికి సానుకూల శక్తి ఎప్పుడూ వస్తూనే ఉండాలంటే ప్రధాన ద్వారం వద్ద క్లీన్‌గా ఉంచుకోవాలి. చెత్తా చెదారం లేకుండా జాగ్రత్తపడాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త కుండీలు లేకుండా జాగ్రత్తపడాలి.