Venu Swamy : నేను బ్రాహ్మణుడినే.. అయినా మాంసం తింటా.. మందు తాగుతా.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : నేను బ్రాహ్మణుడినే.. అయినా మాంసం తింటా.. మందు తాగుతా.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 September 2022,6:00 pm

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడనే విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. నెక్స్ట్ ఎవరికి ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తాడు వేణు స్వామి. ఆయన పలు ఇంటర్వ్యూలు చూస్తే అదే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలామందిపై కామెంట్స్ చేసిన వేణు స్వామి తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశాడు.

నేను బ్రాహ్మణుడినే అయినా సరే.. నేను మాంసం తింటాను.. మందు తాగుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి. నిజానికి.. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు.. మద్యం ముట్టరు అనే విషయం అందరికీ తెలిసిందే కదా. కానీ.. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి నేను నాన్ వెజ్ తింటా.. మద్యం తాగుతా అని షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

venu swamy comments about non veg video viral

venu swamy comments about non veg video viral

Venu Swamy :  వేణు స్వామి వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి?

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి పై వ్యాఖ్యలు చేశాడు. ఒక శనివారం నాడు ఎవరో నాన్ వెజ్ తెస్తే అన్నం తినకుండా నాన్ వెజ్ తిన్నా అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కామాక్యా దేవికి ముందు తాను నాన్ వెజ్ తినేవాడిని కాదని.. ఆ తర్వాత నాన్ వెజ్ తినడం ప్రారంభించానని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. కామాక్య అమ్మవారికి మటన్, ఫిష్, చికెన్ నైవేధ్యంగా పెడతారని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. కర్ణాటకలోనూ చాలా దేవాలయాల్లో మద్యం నైవేద్యంగా పెడతారని.. మన దగ్గర తెలంగాణలో అమ్మవార్లకు బోనాలు చేసి నాన్ వెజ్ నైవేద్యంగా పెడతారని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. వాళ్లంతా తినగా.. నేను తింటే తప్పేంటి అని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. అయితే.. సోషల్ మీడియాలో వేణు స్వామి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం మండిపడుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది