Gorantla Madhav : వీడియో లీక్ ఎపిసోడ్: గోరంట్ల మాధవ్‌కి ఊరట.! టీడీపీ పరిస్థితి ఏంటట.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gorantla Madhav : వీడియో లీక్ ఎపిసోడ్: గోరంట్ల మాధవ్‌కి ఊరట.! టీడీపీ పరిస్థితి ఏంటట.?

Gorantla Madhav : న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి ఊరట లభించింది. ప్రచారంలో వున్న వీడియో ఒరిజినల్ కాదని పోలీసులు తేల్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామనీ, వీడియో యూకేలో తొలుత పోస్ట్ అయ్యిందని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఫోన్‌లో వీడియో ప్లే అవుతుండగా, ఎవరో దాన్ని మరో ఫోన్‌ ద్వారా […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,10:00 pm

Gorantla Madhav : న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి ఊరట లభించింది. ప్రచారంలో వున్న వీడియో ఒరిజినల్ కాదని పోలీసులు తేల్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామనీ, వీడియో యూకేలో తొలుత పోస్ట్ అయ్యిందని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఫోన్‌లో వీడియో ప్లే అవుతుండగా, ఎవరో దాన్ని మరో ఫోన్‌ ద్వారా వీడియో తీశారనీ, దాంతో ఒరిజినల్ వీడియో వుందా.? వుంటే, దాని పరిస్థితి ఏంటి.? అనేది తేల్చడానికి వీలు పడదని ఫకీరప్ప పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ప్రచారంలో వున్న వీడియో ఒరిజినల్ కాదని మాత్రం చెప్పగలమని ఫకీరప్ప పేర్కొన్నారు..

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా పని చేశారు. అప్పట్లో టీడీపీ ఎంపీగా పని చేసిన జేసీ దివాకర్ రెడ్డి, ఆ సమయంలో పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పరస్పరం సవాళ్ళ పర్వం కూడా నడిచింది. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా పతనమైతే, రాజకీయాల్లో అనూహ్యంగా ఎదిగారు గోరంట్ల మాధవ్.
ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఎదుగుదలను ఓర్వలేకనే టీడీపీ ఇదంతా చేయించిందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రచారంలో వున్న వీడియో ఒరిజినలా.? కాదా.? అన్నది తేలకుండానే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా నానా యాగీ చేశాయి.

Video Leak Episode Gorantla Madhav Gets Reliefe As Expected

Video Leak Episode, Gorantla Madhav Gets Reliefe, As Expected

ఈ క్రమంలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అధికార పార్టీ సంయమనం పాటించింది. ఇదిలా వుంటే, ఎస్పీ ఫకీరప్ప వివరణపైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా, పలువురు టీడీపీ నేతలు చిత్ర విచిత్రమైన భాష్యాలు చెబుతున్నారు. ‘ఎస్పీ ఎవరు అది ఫేక్ అని చెప్పడానికి..’ అంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తుండడం గమనార్హం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది