సాగర్‌లో టీఆర్‌ఎస్ ఓటమి తప్పదా.. కేసీఆర్ కనిపించేంత ధైర్యవంతుడేం కాదు..!
vijayashanti : తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు ఉన్న ధైర్యం గురించి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన ధైర్యం ఏంటో నాకు తెలుసు అంటూ ఆమె తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి టీఆర్‌ఎస్ కు కాలం దగ్గర పడిందని.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రోజులు లెక్కించుకోవాల్సిందే అని ఆ విషయం ఆయనకు కూడా తెలిసింది అంటూ రాములమ్మ విజయశాంతి అన్నారు.
vijayashanti : మీటింగ్ లకు వెళ్లాలంటే భయం…
ఉద్యమ సమయంలో నాయకులు వచ్చి మీటింగ్ లకు రమ్మంటే కేసీఆర్ భయపడ్డ సందర్బాలు చాలా ఉన్నాయని రాములమ్మ అన్నారు. కేసీఆర్ ను పలు సందర్బాల్లో బలవంతంగా తీసుకు వెళ్లారని కూడా ఆమె అన్నారు. కేసీఆర్ ధైర్యం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఆయన లోపలి భయం తెలియక మాట్లాడుతున్నారు అంటూ విజయశాంతి ఎద్దేవ చేశారు. ఉద్యమ సమయంలో చాలా సందర్బాల్లో మీటింగ్ లకు రాకుండా పారిపోయిన ఘనత ఆయనది. తన బహిరంగ సభలకు కేసీఆర్ మొహం చాటేస్తే ఒప్పించి పిలిపించిన సందర్బాలు చాలా ఉన్నాయని ఆయనకు భయం కారణంగానే మీటింగ్ లకు హాజరు అయ్యేవాడు కాదంటూ విజయశాంతి అన్నారు.
vijayashanti : ఇలాంటి సీఎం ఎందుకు..
అంబేద్కర్ జయంతి సందర్బంగా కనీసం ఆయనకు నివాళ్లు అర్పించేందుకు ముందుకు రాని సీఎం ఉండి ఎందుకు అంటూ విజయశాంతి ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ నిజ స్వరూపం తెలిసింది. ఆయన్ను గద్దె దించే రోజులు వస్తున్నాయంటూ ఈ సందర్బంగా ఆమె పేర్కొంది. నాగార్జున సాగర్ లో ఓటర్లను బెదిరించేందుకు అన్ని మార్గాలను వారు అనుసరిస్తున్నారు. ఓట్లు వేయకుంటే పెన్షన్ కట్ చేస్తామని ఓట్లు వేయని వారికి రైతు బంధు ఇవ్వమంటూ ఆయన చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఈ సందర్బంగా విజయశాంతి ప్రశ్నించారు.