Viral News : ఒక్క మిస్టేక్ తో పోలీసు ఉద్యోగం పోగొట్టుకున్న యువతి .. రీల్స్ చేసే వారికి ఇదే మంచి ఉదాహరణ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : ఒక్క మిస్టేక్ తో పోలీసు ఉద్యోగం పోగొట్టుకున్న యువతి .. రీల్స్ చేసే వారికి ఇదే మంచి ఉదాహరణ..!

 Authored By aruna | The Telugu News | Updated on :10 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : ఒక్క మిస్టేక్ తో పోలీసు ఉద్యోగం పోగొట్టుకున్న యువతి ..

  •   రీల్స్ చేసే వారికి ఇదే మంచి ఉదాహరణ..!

Viral News  : ప్రస్తుతం సోషల్ మీడియాను ఎలా వినియోగించుకుంటున్నారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా యువతీ యువకులు సోషల్ మీడియా కి బానిసలైపోయారు. రీల్స్, షాట్స్ అంటూ ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పాపులర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి రీల్స్ చేయడం వలన తన పోలీసు ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించిన తను ఒకే ఒక్క మిస్టేక్ తో ఉద్యోగం ఊడిపోయింది. సోషల్ మీడియా మోజులో పడి ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ.

ప్రస్తుతం ఈ యువతి ఉదంతం నెట్టింట్లోనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లోను హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆర్తీ సోలంకి అనే కానిస్టేబుల్ నేటి తరం యువతకి అసలైన నిర్వచనం. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ఎప్పటినుంచో అలవాటు. నిత్యం ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉంటారు. ఈ పిచ్చి ఎక్కువైపోవడంతో ఓ రోజున పోలీస్ యూనిఫామ్ ధరించి వీడియో రికార్డు చేసింది. అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హ నటించిన పాతకాలం నాటి సినిమాలోని పాటకు తన పెదాలు ఆడించింది. తర్వాత దాని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక జనాలు పోలీసులు ఇలాంటి వీడియోలు చేస్తే ఊరుకుంటారా. ఆ వీడియోను విపరీతంగా వైరల్ చేశారు. బోలెడన్ని కామెంట్స్, లైక్స్ తో రచ్చ రచ్చ చేశారు. ఇది చివరకు ఆర్తీ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు వెంటనే ఆర్తిని జాబ్ లో నుంచి తీసేసారు. అంతేకాకుండా డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ కూడా ప్రారంభించారు. దీంతో ఆర్తీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె చేసిన నిర్వాకం పోలీస్ డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ యువతి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది