Viral News : లేచిపోయిన కోడల్ని సైకిల్ పై వెళ్లి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మామ ..!!
Viral News : లేచిపోయిన కోడలి ఆచూకీ కోసం మామ సైకిల్ తొక్కుకుంటూ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. 72 ఏళ్ల వృద్ధుడు ఇంతటి చలిలో కూడా సైకిల్ తొక్కుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఏ రోజు పోలీస్ స్టేషన్ గడప తొక్కను ఆ పెద్దాయన కోడలి కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఈ పెద్దాయన కోడలు ప్రియుడుతో కలిసి పారిపోయింది. దీంతో తన కోడల్ని వెతకండి అంటూ పోలీసులకు విన్నపించుకున్నాడు. ఆమె భర్తను పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో చోటుచేసుకుంది.
రాంప్రసాద్ అనే 72 ఏళ్ల వృద్ధుడు సైకిల్ మీద 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చాడు. రాంప్రసాద్ కాన్పూర్ జిల్లాలో ఘటంప్పూర్ లోని దహెలి లో ఉంటాడు. ఇతనితోపాటు కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు ఉంటారు. అదే గ్రామానికి చెందిన సుమిత్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న కోడలు 15 రోజుల క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో రామ్ ప్రసాద్, కొడుకు ఘటంపూర్ పోలీస్ స్టేషన్ లో బంగారం,డబ్బు తీసుకొని పారిపాయిందని ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో రాంప్రసాద్ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ కమిషనరేట్ ఆఫీస్ కి సైకిల్ మీద వెళ్ళాడు.
ఇంటి నుంచి ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నాడు. ఉదయం 6 గంటలకు బయలుదేరి నాన్ స్టాప్ గా సైకిల్ తొక్కుకుంటూ కమిషనరేట్ ఆఫీస్ కి వెళ్ళాడు. 72 ఏళ్ల వయసులో అంత దూరం ప్రయాణం చేయడం మామూలు విషయం కాదు. అంత దూరం నుంచి ఫిర్యాదు చేయడానికి వచ్చిన పెద్దాయనని చూసి కమిషనర్ బాధ పడిపోయారు. దీంతో వెంటనే ఘటంపూర్ పోలీసులకు ఫోన్ చేసి కేసును ఇన్వెస్ట్ గేట్ చేయమని ఆదేశాలు జారీ చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.