Vishwambara | విశ్వంభర నుండి అదిరిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పండగే
Vishwambara | చిరంజీవి బర్త్డేకి ఆయన కొత్త సినిమా నుండి అప్డేట్ రాకపోతే ఫ్యాన్స్ కచ్చితంగా హర్ట్ అవుతారు. అందుకే చిరంజీవి బర్త్డేకి ఒకరోజు ముందుగానే ఆయన కొత్త సినిమా నుండి అప్డేట్ ఇచ్చేసారు. తాజాగా చిరంజీవి తన విశ్వంభర మూవీకి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
#image_title
ఒకే ఒక్క కారణం..
ఆ వీడియోలో మాట్లాడుతూ.. “చాలా రోజుల నుండి విశ్వంభర లేట్ ఎందుకు అవుతుంది అని ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ విశ్వంభర సినిమా ఆలస్యం అవ్వడానికి ఒకే ఒక్క కారణం. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ఈ సినిమాని అత్యంత క్వాలిటీతో.. అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశంతో సినీ నిర్మాతలు,దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. అందుకే విశ్వంభర సినిమా లేట్ అవుతోంది.
ఈ సమయంలో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సముచిత సమయం ఇది. విశ్వంభర సినిమా గురించి చెప్పాలంటే.. ఇది ఒక చందమామ కథ లాగా సాగిపోయే కథనం. ఈ సినిమా చూస్తున్నంత సేపు చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకోసం, నాకోసం యూవీ క్రియేషన్స్ వాళ్లు మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుండి ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు.ఆగస్టు 21 సాయంత్రం 6:06 గంటలకు విశ్వంభర నుండి గ్లింప్స్ రిలీజ్ చేస్తారు అని స్పష్టం చేశారు. దీనిపై అందరిలో ఆసక్తి ఉంది.
View this post on Instagram