VIVO Smart Phones : చైనా మొబైల్ కంపెనీ వివో స్మార్ట్ ఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని టెక్ వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. బడ్జెట్ రేంజ్ లో ఆరు కొత్త మోడల్స్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి వివో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టిప్ స్టర్ పరాస్ గుగ్లాని రిపోర్ట్ ప్రకారం వివో కంపెనీ లాంచ్ చేయడానికి సిద్ధం కాబోతుందంట. వీవో Y02S, వీవో Y16, వీవో Y35, వీవో Y22, వీవో Y22S, వీవో Y10A వంటి పేర్లతో ఆడు ఆరు మోడల్స్ ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం అయితే ఈ మోడల్స్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధరలను ఇంకా వెల్లడించలేదు. వివో Y22S కు సంబంధించిన ఫోటోలు, స్పెసిఫికేషన్లను ప్రైస్ బాబా రివీల్ చేసింది. గతేడాది ఇండోనేషియాలో ప్రారంభించిన వివో Y21S సక్సెస్ గా రానుందని తెలిపింది.
ప్రైస్ బాబా ప్రకారం వివో Y22S వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా ఉండనుంది. అలాగే ఈ ఫోన్ డార్క్ బ్లూ, స్కై బ్లూ కలర్స్ లో అందుబాటులోకి రానుంది. వివో బ్రాండింగ్ ఫోన్ ముందు భాగంలో ఉండనుంది. వివో Y22S స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 6.55 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేతో వివో Y22S వస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. HD రిజల్యూషన్ తో కూడిన LCD ప్యానెల్ దీని స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ కావచ్చు. కెమెరా విషయానికి వస్తే 50MP మెయిన్ లెన్స్,2MP సెకండరీ సెన్సార్ తో వెనుక వైపు డ్యూయల్ కెమెరా రానున్నట్లు సమాచారం. ఈ సెన్సార్ ను డెప్త్ లేదా మాక్రో షాట్స్ కోసం ఉపయోగించి ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబి ర్యామ్ మరియు 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉండవచ్చు. డ్రాగన్ 680soc ద్వారా ఇది పవర్ పొందుతుంది.
అడిషనల్ స్టోరేజ్ కోసం మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనున్నట్లు టాక్. వివో Y22S మోడల్ 18w ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mAh రానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12తో ఈ స్మార్ట్ ఫోన్ బూట్ అవుతుంది. స్మార్ట్ఫోన్ ధర కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది బడ్జెట్ రేంజ్ లో ఇండియాలో లాంచ్ అవుతుందని దీని ధర 15 వేల లోపు ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. వివో కంపెనీ ఇటివల మిడ్ రేంజ్ లో వివో v25 ప్రో తో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 120HZ డిస్ప్లే డైమండ్ సిటీ 1300soc,66w ఫాస్ట్ ఛార్జింగ్ 20 ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.