పెళ్లయిన మూడు రోజులకే గర్భం.. మూడు పెళ్లిళ్లు.. అచ్చం సినిమా స్టోరీని తలపించేలా..!
Cheating Woman : వామ్మో.. కొందరు యువతులు చూడటానికి అమాయకంగా కనిపిస్తారు. కానీ.. వాళ్లు కిలాడీ లేడీలు. అవును.. ఈ యువతి గురించి తెలిస్తే మీరే ముక్కున వేలేసుకుంటారు. వామ్మో.. ఇటువంటి లేడీలు కూడా ఉంటారా? అయితే.. జాగ్రత్తగా ఉండాలి.. అనేంత రేంజ్ లో ఈ యువతి చేసిన చీటింగ్ గురించి తెలుసుకుందాం రండి. ఏపీలోని వైజాగ్ సమీపంలోని గాజువాకకు చెందిన నంబారు రేణుక గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తనకు కొన్ని ఏళ్ల కింద జగదీశ్ […]
Cheating Woman : వామ్మో.. కొందరు యువతులు చూడటానికి అమాయకంగా కనిపిస్తారు. కానీ.. వాళ్లు కిలాడీ లేడీలు. అవును.. ఈ యువతి గురించి తెలిస్తే మీరే ముక్కున వేలేసుకుంటారు. వామ్మో.. ఇటువంటి లేడీలు కూడా ఉంటారా? అయితే.. జాగ్రత్తగా ఉండాలి.. అనేంత రేంజ్ లో ఈ యువతి చేసిన చీటింగ్ గురించి తెలుసుకుందాం రండి. ఏపీలోని వైజాగ్ సమీపంలోని గాజువాకకు చెందిన నంబారు రేణుక గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తనకు కొన్ని ఏళ్ల కింద జగదీశ్ అనే ఓ వ్యక్తితో పెళ్లి అయింది. అది పెద్దలు కుదిర్చిన వివాహమే. అయితే.. తన పెళ్లి అయిన మూడు రోజులకే తను గర్భం దాల్చింది అనే విషయం తెలిసింది.
దీంతో అందరూ షాక్ అయ్యారు. అప్పుడు తన అఫైర్ గురించి బయట పడింది. తనకు పెళ్లి కాకముందే.. శ్రీనివాస్ అనే వ్యక్తితో తను ప్రేమలో ఉందట. వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో తను గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తన మొదటి భర్త జగదీశ్.. తనను వదిలేశాడు. దీంతో తను శ్రీనివాస్ దగ్గరికి వెళ్లింది. అతడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కానీ.. పెళ్లి చేసుకోలేదు. ఈలోపు రేణుక ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే.. రేణుకను పెళ్లి చేసుకోకుండా.. మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాస్ సిద్ధం కావడంతో.. రేణుక అతడిని నిలదీసింది. దీంతో.. తనను, పాపను.. ఇద్దరినీ చూసుకుంటానని.. డబ్బులు కూడా ఇస్తానని రేణుకను నమ్మించాడు. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నాడు.
Cheating Woman : రేణుకను వదిలించుకోవడానికి ప్లాన్ వేసిన శ్రీనివాస్
తనకు వేరే పెళ్లి అవడంతో.. రేణుకను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు శ్రీనివాస్. దీంతో రేణుకనే పిలిచి.. తన తమ్ముడు ప్రసాద్ గురించి చెప్పాడు. తన ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఇచ్చి.. ప్రసాద్ ను లవ్ లోకి దింపాలని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ ను గుడ్డిగా నమ్మింది రేణుక. ప్రసాద్ ను లైన్ లో పెట్టింది. లైన్ లో పెట్టడమే కాదు.. ఏకంగా. అతడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.
ప్రసాద్.. లక్నోలో ఉద్యోగం చేస్తుండటంతో… రేణుకను అక్కడికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. తనకు బంగారం చేయించాడు. తనకు డబ్బులు కూడా బాగానే ఇచ్చేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రేణుక.. తనకు వైజాగ్ లో ఉద్యోగం వచ్చిందని వైజాగ్ కు వెళ్తానని చెప్పింది. దీంతో తనను అక్కడికి పంపిచేశాడు. అక్కడికి వెళ్లాక.. రేణుక.. తన ప్రియుడు శ్రీనివాస్ తో సెటిల్ అయిపోయింది. ప్రసాద్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. చెబుతూ.. తన భర్త నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టింది. అలా.. తన తల్లికి అనారోగ్యం అనే పేరుతో.. అతడి నుంచి 45 లక్షలు లాగేసింది.
కట్ చేస్తే.. ఒక రోజు ప్రసాద్ కు ఫోన్ చేసి.. తన తల్లి చనిపోయిందని చెప్పింది. కరోనా వల్ల ప్రసాద్ విశాఖ రాలేకపోయాడు. దీంతో సాయి అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది రేణుక. అయితే.. రేణుక అసలు రంగు, తన మోసం గురించి.. ప్రసాద్ కు తెలియడంతో.. వెంటనే వైజాగ్ వచ్చి.. గాజువాక పోలీస్ స్టేషన్ లో తనపై కేసు పెట్టాడు. దీంతో అసలు.. వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.