Volvo EV : వోల్వో నుంచి ఈవీ-ల‌గ్జ‌రీ కారు మార్కెట్లోకి… ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Volvo EV : వోల్వో నుంచి ఈవీ-ల‌గ్జ‌రీ కారు మార్కెట్లోకి… ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కి.మీ!

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,8:30 am

Volvo EV: ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ త‌యారీలో టూవీల‌ర్, కార్ల త‌యారీ సంస్థ‌ల మ‌ధ్య పోటీ ఏర్ప‌డింది. రోజురోజుకీ చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో చాలామంది ఈవీ ల‌పై మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ కార్ల సంస్థ‌లు పోటీ ప‌డి మ‌రీ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీపై పోక‌స్ పెట్టాయి. ఈ మధ్యనే.. సౌత్ కొరియా ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ కియా.. వీ6 మోడల్ లాంచ్ చేయగా.. దేశీయ కంపెనీ అయిన హ్యుందాయ్.. ఐవోనిక్ 6 ను మార్కెట్ లోకి పరిచయం చేసింది. వీళ్ల‌ బాటలోనే మరో సంస్థ కూడా చేరింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ స్వీడిష్ మార్కెట్ దిగ్గజం వోల్వో ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్‌ చేసింది. ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఎస్ యూవీ ధర రూ.55.90 లక్షలు.

పెట్రోల్‌వెహికల్‌ ఎక్స్ సి 40తో దీన్ని పోలిస్తే రూ 1.40 లక్షలు మాత్రమే ఎక్కువ. భారత్ లో అసెంబుల్ చేస్తున్న మొదటి విలాసవంత విద్యుత్తు.. కారు ఇదే. బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌లోని వోల్వో యూనిట్‌లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. ఇది వోల్వో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రూ.50వేలు చెల్లించి జూలై27 నుంచి బుకింగ్‌ చేసుకోవచ్చు. ఎక్స్ సీ40 రీఛార్జ్ 11కే డ‌బ్ల్యూ వాల్ బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది. కారుపై మూడేళ్ల వారంటీతోపాటు, బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది. వోల్వో ఎక్స్ సీ 40 రీఛార్జ్ 150 కే డ‌బ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78 కేడ‌బ్ల్యూఎచ్ బ్యాటరీని ఈ కారులో అందించింది.

volvo ev luxury car releasing soon

volvo ev luxury car releasing soon

33 నిమిషాల్లో కారులో 10 నుండి 80 శాతం వరకు, 50 కే డ‌బ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు 2.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418 కేఎం పరిధితో, ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ ట్విన్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408ఎచ్పీ , 660 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్‌తో నడిచే ఎక్స్ సీ 40 కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైందనీ, లగ్జరీ ఆడి ఇ-ట్రాన్ 55 క్వాట్రో పోలి ఉందని భావిస్తున్నారు. 55.90 లక్షల ధరతో ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఒకవైపు మినీ కూపర్ ఎస్‌ఈ.. బీఎండ‌బ్ల్యూ ఐ4 , కియా ఈవీ6 వంటి లగ్జరీ ఈ – కార్లకు గట్టిపోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది