Volvo EV: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీలో టూవీలర్, కార్ల తయారీ సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. రోజురోజుకీ చమురు ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఈవీ లపై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్ల సంస్థలు పోటీ పడి మరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై పోకస్ పెట్టాయి. ఈ మధ్యనే.. సౌత్ కొరియా ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ కియా.. వీ6 మోడల్ లాంచ్ చేయగా.. దేశీయ కంపెనీ అయిన హ్యుందాయ్.. ఐవోనిక్ 6 ను మార్కెట్ లోకి పరిచయం చేసింది. వీళ్ల బాటలోనే మరో సంస్థ కూడా చేరింది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్వీడిష్ మార్కెట్ దిగ్గజం వోల్వో ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఎస్ యూవీ ధర రూ.55.90 లక్షలు.
పెట్రోల్‌వెహికల్ ఎక్స్ సి 40తో దీన్ని పోలిస్తే రూ 1.40 లక్షలు మాత్రమే ఎక్కువ. భారత్ లో అసెంబుల్ చేస్తున్న మొదటి విలాసవంత విద్యుత్తు.. కారు ఇదే. బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌లోని వోల్వో యూనిట్‌లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. ఇది వోల్వో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రూ.50వేలు చెల్లించి జూలై27 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ సీ40 రీఛార్జ్ 11కే డబ్ల్యూ వాల్ బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది. కారుపై మూడేళ్ల వారంటీతోపాటు, బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది. వోల్వో ఎక్స్ సీ 40 రీఛార్జ్ 150 కే డబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78 కేడబ్ల్యూఎచ్ బ్యాటరీని ఈ కారులో అందించింది.
33 నిమిషాల్లో కారులో 10 నుండి 80 శాతం వరకు, 50 కే డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు 2.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418 కేఎం పరిధితో, ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ ట్విన్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408ఎచ్పీ , 660 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్‌తో నడిచే ఎక్స్ సీ 40 కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైందనీ, లగ్జరీ ఆడి ఇ-ట్రాన్ 55 క్వాట్రో పోలి ఉందని భావిస్తున్నారు. 55.90 లక్షల ధరతో ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఒకవైపు మినీ కూపర్ ఎస్‌ఈ.. బీఎండబ్ల్యూ ఐ4 , కియా ఈవీ6 వంటి లగ్జరీ ఈ – కార్లకు గట్టిపోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.