YCP : ఒక్కసారిగా పెరిగిన వైసీపీ ఓటు బ్యాంకు .. అయినా కంగారు పడుతున్న జగన్ ఫాన్స్
YCP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయని తెలిసిందే. ఒకసారి జగన్ కు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి రెండోసారి కూడా ఇస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. అసలే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కరోనా ఆ తర్వాత వరదలు, వర్షాలు. అసలు పాలనకు సమయం ఎక్కడిది. అయినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జగన్ ముఖ్యమంత్రిగా గెలిచారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారు. అయినప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఎంతోకొంత భయం దాక్కున్నది. కానీ.. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం భారీగా పెరిగిందట. గత ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు 49.7 శాతంగా ఉంది. కానీ.. ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందట. వైసీపీకి మద్దతు కూడా పెరిగినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 22 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. దీంతో ఏపీలోనే అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. అధికారంలో ఉన్న టీడీపీని ఘోరంగా ఓడించింది.
YCP : రెండో సారి గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ
అయితే.. రెండో సారి కూడా ఏపీ ప్రజలు వైసీపీనే గెలిపించబోతున్నారని.. వైసీపీ ఓటు బ్యాంకు 49.7 శాతం నుంచి 58 శాతం వరకు పెరిగిందని అంటున్నారు. ఈ మాత్రం ఓటు బ్యాంకుతో రెండో సారి ఏపీలో గెలవడం కష్టమేమీ కాదంటున్నారు. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక, బద్వేలు, నెల్లూరు ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఆ ఎన్నికల్లో విజయం ఆధారంగా వైసీపీకి ఓటు బ్యాంకు పెరిగిందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు.. 175 సాధించాలని, 25 ఎంపీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలు సాధించాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంటే.. ఏపీలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనేదే వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రతి వైసీపీ నేత.. గడప గడప కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ పేద ప్రజల కోసం తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలు ఓటు బ్యాంకును పెంచాయని చెబుతున్నా.. మరోవైపు ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని వైసీపీ నాయకులకు అర్థం అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా.. లేక అనుకూలత పెరిగిందా అనే విషయం తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.