Rains | తెలంగాణ, ఏపీకి వర్షాల హెచ్చరిక.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్, బతుకమ్మ వేడుకలకు అంతరాయం
Rains | తెలంగాణలో ఈరోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

#image_title
వర్షాలతో ఇబ్బందులు..
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేటలో వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న కూడా జనగాం, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో 8.5 సెం.మీ, ఉప్పల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో 6 సెం.మీ వర్షం నమోదైంది. ఈ ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలకు వర్షాలు అడ్డంకిగా మారుతున్నాయి.
పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా వేడుకలు నిలిచిపోయినట్టు సమాచారం. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపించనుంది. వాతావరణ శాఖ హెచ్చరించిన వివరాల ప్రకారం, ఇవాళ మంచిపాల్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గ్రామీణ ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.