Weekly Pay Policy : ఇక నుంచి నెలకోసారి కాదు.. వారానికి ఓసారి జీతం.. కొత్త శాలరీ పాలసీ వచ్చేసింది
Weekly Pay Policy : సాధారణంగా ఉద్యోగాలు చేసేవాళ్లు జీతం కోసం నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. ప్రతి నెల మొదటి తారీఖు కోసం ఎదురు చూడని ఉద్యోగి ఉండడు. ఒకటో తారీఖున జీతం పడిన తర్వాత మళ్లీ వచ్చే నెల ఒకటో తారీఖు కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న జీతాల పాలసీ. ప్రభుత్వ కంపెనీ అయినా.. ప్రైవేటు కంపెనీ అయినా ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా నెల రోజులకు ఒకసారి మాత్రం జీతాలు చెల్లిస్తూ ఉంటాయి.కానీ.. ఇక నుంచి ఆ కాలం పోనుంది. నెల రోజుల పాటు జీతం కోసం ఇక నుంచి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
అవును.. వారానికి ఒకసారే జీతం అందుకోవచ్చు. దాన్నే వీక్లీ పే పాలసీ అంటారు. ఈ పాలసీని ప్రస్తుతం యూఎస్ లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ లాంటి దేశాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అక్కడ ఉద్యోగులకు వారానికి ఒకసారి జీతం చెల్లిస్తున్నారు.ఇప్పుడు వీక్లీ పే కల్చర్ మన దేశంలో కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ వీక్లీ పేమెంట్ సిస్టమ్ ను ఇండియా మార్ట్ సంస్థ స్టార్ట్ చేసింది. ఇండియా మార్ట్ ఉద్యోగులకు వారానికి ఒకసారి చెల్లిస్తామని ప్రకటించింది.
Weekly Pay Policy : మన దేశంలోనూ ప్రారంభమైన వీక్లీ పే కల్చర్
ఉద్యోగుల క్షేమం కోసం.. వాళ్ల ఆర్థిక అవసరాలను తీర్చడం కోసమే.. వీక్లీ పాలసీని తీసుకొస్తున్నామని ఇండియా మార్ట్ వెల్లడించింది.సంస్థలో వీక్లీ పే పాలసీ రావడాన్ని ఉద్యోగులు కూడా స్వాగతించారట. చాలా సంవత్సరాల నుంచి వీక్లీ పే విధానాన్ని తీసుకురావడం కోసం ఇండియా మార్ట్ ప్రయత్నాలు చేస్తోందట. దానిలో భాగంగానే ఇండియా మార్ట్ ప్రతి వారం ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించేది. తాజాగా వీక్లీ పేను ఇండియా మార్ట్ తన ఉద్యోగులకు ఆఫర్ చేసింది.