Weird News : అన్నా చెల్లి పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?
Weird News : అన్నా చెల్లెలి మధ్య ఉండే సంబంధం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతీ ఒక్కరు తమకు ఒక అన్న ఉంటే బాగుండని, తమకు ఒక్క చెల్లెలు ఉంటే బాగుండని ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు. అటువంటి గొప్ప రిలేషన్ షిప్ అన్నా చెల్లెల్లది. కాగా, ఆ ప్రదేశంలో వింత ఘటన జరిగింది. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఈ వింత విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే…దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఇటీవల ఫిరోజాబాద్‌లో సామూహిక వివాహాలు జరిగాయి. ఈ మ్యారేజెస్‌కు ప్రభుత్వమే ఖర్చులన్నీ భరించింది. ఈ జంటలకు అందరికీ అవసరమయ్యే సామగ్రిని ప్రభుత్వం అందించింది. దాంతో సామూహిక వివాహాలు చేసుకున్న నూతన వధూవరులు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దాంతో అందరూ తమకు సంబంధించిన ఫొటోలు పరిశీలించుకుంటుండగా వింత విషయం వెలుగులోకి వచ్చింది.
Weird News : వాటి కోసమే అలా చేశారు..
వివాహ జంటల ఫొటోలను చూస్తుండగా అందులో ఓ ఫొటోలో అన్న, చెల్లి ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వం అందించే కానుకల కోసం వారు ఇలా చేశారని తేల్చారు స్థానికులు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసింది. చివరకు అధికారులకు ఈ విషయం తెలియగా, వారు చర్యలకు సిద్ధమయ్యారు. అయితే, ఇలా అన్నా చెల్లెలు ప్రభుత్వం ఇచ్చే కానుకల కోసం పెళ్లికి పూనుకోవడం సరికాదని స్థానికులు అంటున్నారు.