TRS : టీఆర్ఎస్ మంత్రులే ఇలా ఉంటే.. ఇక పార్టీ పరిస్థితి ఏంటి?
TRS : ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. పార్టీలోనూ ఎన్నో అంతర్గత సమస్యలు. పార్టీ నేతల్లోనూ ఎన్నో వివాదాలు. వీటన్నింటి మధ్య పార్టీ బతికి బట్టకట్టాలంటే ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీని తొక్కేసి ఎలా తెలంగాణలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ తెగ ఉబలాటపడుతోంది.
ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన సీట్లను బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీ బాగానే ఆదరణ లభిస్తోంది. అందుకే.. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లోనూ గెలవాలన్న కసితో బీజేపీ ఉంది.
ఓవైపు తెలంగాణ ప్రజలను తమ వైపునకు తిప్పుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ పార్టీ ముందకెళ్తుంటే టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
TRS : తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ?
నిన్న కాక మొన్న వచ్చిన బీజేపీ పార్టీని టీఆర్ఎస్ నేతలు ఎదుర్కోలేకపోతున్నారు. చివరకు మంత్రులు కూడా బీజేపీ ఈక కూడా పీకలేకపోతున్నారు. అదే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి లేనిపోని చెడ్డపేరు తీసుకొస్తోంది. మాట్లాడినా.. మంత్రి కేటీఆర్ లేకపోతే మంత్రి హరీశ్ రావు.. ఇద్దరు తప్పితే ఇంకెవ్వరూ మాట్లాడటం లేదు.
మిగితా మంత్రులంతా.. తమకేమీ పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీ తన దూకుడును ఇంకాస్త పెంచింది. టీఆర్ఎస్ పార్ట నేతలు ఏమాత్రం స్పందించకుండా ఉంటుండటంతో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కిక్కుమనకుండా ఉండటం ఎంతైనా టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది.