YS Jagan : వైఎస్ జగన్ ని 2024 లో గెలిపించబోయే సూత్రం ఇదే
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం 2024 ఎన్నికల గురించే తెగ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2024 లో గెలిస్తేనే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది. లేకపోతే మళ్లీ ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు ఎంత ముఖ్యమో.. మళ్లీ ముఖ్యమంత్రి అవడం కూడా జగన్ కు అంతే ముఖ్యం. అందుకే.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం సీఎం జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెలుపు, ఓటమి అనే రెండు ఆప్షన్లు మనకు లేవని, ఖచ్చితంగా ఈసారి గెలవాల్సిందేనని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెబుతున్నారు. ఏమాత్రం మొహమాటం తనకు లేదని, సర్వేలో గెలుస్తారని తేలితేనే సీటు ఇస్తా అని నేతలకు తేల్చి చెప్పారట సీఎం జగన్.
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పార్టీ గెలవాలంటే.. రాయలసీమపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసారి ఏపీలో ఉన్న 175 సీట్లు ఖచ్చితంగా గెలవాలని జగన్ చెబుతున్నారు. రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ 49 సీట్లలో గెలిచింది. ఇంకా మూడు సీట్లు మాత్రం గెలవలేకపోయింది. నిజానికి రాయలసీమలో వైసీపీకి అనుకూలంగానే ఉంది. కానీ.. వైసీపీ 175 సీట్లు గెలవాలంటే రాయలసీమలో ఉన్న అన్ని సీట్లను గెలవాల్సిందే.అయితే.. ప్రస్తుతం టీడీపీ రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది.
YS Jagan : రాయలసీమలో 20 నియోజకవర్గాల్లో బలంగా టీడీపీ?
రాయలసీమలో 20 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. వైసీపీకి 34 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ.. వైసీపీ అన్ని సీట్లు గెలుచుకోవాలి కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. అందరు కష్టపడాలని.. వైసీపీ టార్గెట్ ను రీచ్ అవ్వాలని సీఎం జగన్ రాయలసీమ నేతలతో స్పష్టం చేశారు. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలపు కోసం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కష్టపడాలని, దానికి తగ్గట్టుగా కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉండి ప్రజలకు చేరువవుతేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు సునాయసం అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.