Lawyer vs Advocate : లాయర్ వేరు.. అడ్వకేట్ వేరు.. వాళ్ల మధ్య ఉన్న తేడా ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు?
Lawyer vs Advocate : చాలామందికి సుపరిచితమైన వ్యక్తులు లాయర్లు, అడ్వకేట్లు. చాలామంది మేము లాయర్లం అని చెప్పుకుంటారు.. మరికొందరు మాత్రం మేము అడ్వకేట్లం అని చెప్పుకుంటారు. ఇంతకీ.. లాయర్ అంటే ఎవరు? అడ్వకేట్ అంటే ఎవరు? ఇద్దరి మధ్య ఉండే తేడా ఏంటి? అనేది చాలామందికి తెలియదు. కొందరైతే ఇద్దరూ ఒకరే అనుకుంటారు. కానీ.. ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. లా చదివిన తర్వాత డిగ్రీ పట్టా చేతికి వస్తుంది కదా.. వాళ్లను మాత్రమే లాయర్లు అంటారు.
అంటే.. వాళ్లు చట్టప్రకారం.. లాయర్ గా ఒక డిగ్రీ పట్టాను పుచ్చుకున్నారన్నమాట. అయితే.. లాయర్ అయినంత మాత్రాన.. అంటే లా పట్టా చేతిలో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లి వాదించలేడు. ముందు వాళ్లు తమ స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు.. బార్ నిర్వహించే పరీక్షలోనూ పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర కొన్నేళ్ల పాటు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎల్బీ పట్టా ఉండగానే కాదు.. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో పాస్ అయి.. కొన్నేళ్ల పాటు సీనియర్ అడ్వకేట్ దగ్గర పనిచేసిన వాళ్లనే అడ్వకేట్ అని పిలుస్తారు.
Lawyer vs Advocate : లాయర్ గానే ఉంటే కోర్టులో వాదించలేరా?
కేవలం లాయర్ గానే ఉంటే.. కోర్టులో అస్సలు వాదించలేరు. లాయర్లు కేవలం ఏవైనా న్యాయ పరమైన సలహాలు ఉంటే ఇవ్వగలరు. అంతే.. కానీ కోర్టులోకి వెళ్లి ఒక క్లయింట్ తరుపున వాదించలేరు. కానీ.. ఒక అడ్వకేట్ మాత్రం కోర్టులో వాదించగలడు. కేవలం లాయర్ గా ఉంటే సరిపోదు.. అడ్వకేట్ గా చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. చాలా కేసులను వాదించిన తర్వాత అప్పుడు అడ్వకేట్ కు అనుభవం వస్తుంది.