WhatsApp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. అడ్మిన్స్ కంట్రోల్‌లోనే గ్రూప్
WhatsApp : వాట్సాప్.. ఇప్పుడు ఇది తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్ తప్పక ఉంటుంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ చాటింగ్ , గ్రూప్ చాటింగ్ , స్టేటస్‌లతో మునిగి తేలుతుంటారు. వాట్సాప్ రోజురోజుకు మరింత పరిణితి చెందుతూ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొందరిని చేరుస్తూ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుంటూ తమ తమ సందేశాలను పంచుకుంటున్నారు. ఇక వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు ఎవరైనా మెసేజ్ లు చేస్తే దానిని తొలగించాలంటే పంపిన వారు తప్ప ఇంకెవ్వరు కూడా తొలగించే అనుమతి ఉండదు.ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ల కొరకు అదిరిపోయే ఫీచర్స్‌ను తీసుకువచ్చింది వాట్సాప్.
వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే మెసేజ్‌లను డిలీట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్‌లకు యాక్సెస్ ఇచ్చే ఫీచర్‌ను ఈ మెసేజింగ్ యాప్ తీసుకురానుందట. దీని ద్వారా టైమ్, కౌంట్‌తో సంబంధం లేకుండా గ్రూప్ అడ్మిన్‌లు మెసేజ్‌లను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రూపులో ఉండే ప్రతి ఒక్కరూ మెసేజ్‌ను చదవకముందే అడ్మిన్ దాన్ని డిలీట్ చేయవచ్చు. ఈ విషయాన్ని వాట్సాప్ ట్రాకర్ Wabetainfo ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. గ్రూపులోని మెసేజ్‌లను డిలీట్ చేసే సదుపాయం ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో రానుందని పోస్ట్ చేసింది.ఇలాంటి ఫీచర్ ఇప్పటికే టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో ఉండగా.. వాట్సాప్ కూడా దానిపై పనిచేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. WABetaInfo ప్రకారం… ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్‌లలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
WhatsApp : అదిరిపోయే ఫీచర్..
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. వాట్సాప్ గ్రూపులలో యూజర్లు పంపిన మెసేజ్‌లను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్‌ను అందులో చూడవచ్చు. యూజర్ పంపిన మెసేజ్‌ను గ్రూప్ అడ్మిన్స్ డిలీట్ చేశారనే విషయాన్ని గ్రూప్‌లోని ఇతర సభ్యులందరికీ తెలుస్తుంది. కొత్తగా తీసుకువచ్చే ఈ ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అసభ్యకరమైన, అభ్యంతరకరమైన సందేశాలను తొలగించడం గ్రూప్ అడ్మిన్లకు సులభమవుతుంది. గ్రూప్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే సందేశాలను తొలగించడంలో ఇది వారికి సహాయపడుతుంది. అనవసరమైన సమస్యల నుంచి తమను తాము కాపాడుకునే అవకాశం లభిస్తుంది