WhatsApp : 17.5 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్..
WhatsApp : వాట్సాప్ వినియోగదారులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాట్సాప్ అతిపెద్ద చర్య తీసుకుంది. ఇండియాకు చెందిన 17.5 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసేసింది. గతేడాది 602 ఫిర్యాదులు రావడంతో దీన్ని సీరియస్ గా తీసుకున్న వాట్సాప్ రూల్స్ అతిక్రమించిన అకౌంట్లను వెంటనే బ్యాన్ చేసినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును తాజాగా సమర్పించింది.
రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసిది వాట్సాప్.అయితే యూజర్లు తమ అకౌంట్లను సేఫ్టీగా ఉపయోగించుకునేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని, తమ ఫ్లాట్ ఫామ్‌ను అనుచిత చర్యలకు ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ వెల్లడించింది.
ఇక యూజర్లు తమ ప్లాట్ ఫామ్‌ను సేఫ్టీగా మార్చుకునేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు డేటా సైన్స్ వాడుతున్నట్టు తెలిపింది వాట్సాప్. అయితే దీని మీద వాట్సాప్ యూజర్లు ఎవరూ భయపడాల్సిన పనిలేదని వాట్సాప్ వివరించింది. యూజర్లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని వివరించింది.