WhatsApp : వాట్సప్ మెసేజ్ ను పొరపాటున డిలీట్ చేశారా? నో ప్రాబ్లమ్.. మళ్లీ ఇలా పొందొచ్చు
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సప్ ను ఉపయోగిస్తున్నారు. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకునే సదుపాయం వాట్సప్ లో ఉంది. ఉచితంగా చాటింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి.. వాట్సప్ కు అంత ఆదరణ లభిస్తోంది. ఈరోజుల్లో ఫోన్లలో మాట్లాడేవాళ్లు తక్కువే. ఏదైనా అవసరం ఉంటే వాట్సప్ లో మెసేజ్ పెట్టడం లేదా వాట్సప్ కాల్ చేయడం అలవాటుగా మారింది. అందుకే.. వాట్సప్ కు ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్. అయితే.. వాట్సప్ లో ప్రస్తుతం సరికొత్త ఫీచర్ యాడ్ కానుంది.
సాధారణంగా వాట్సప్ లో ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు దాన్ని పొరపాటున డిలీట్ చేసినా తిరిగి పొందే ఫీచర్ అన్నమాట. కొందరు.. వాట్సప్ లో మెసేజ్ పంపించి.. తొందరలో డిలీట్ ఫర్ ఎవరీ వన్ అని సెలెక్ట్ చేయకుండా.. డిలీట్ ఫర్ మీ అని కొడుతుంటారు. దాని వల్ల.. ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాళ్లకు అలాగే ఉంటుంది కానీ.. దాన్ని పంపించిన వాళ్ల ఫోన్ లో మాత్రం ఆ మెసేజ్ ఉండదు. ఏదైనా గ్రూప్ లో కానీ.. ఇతరులకు కానీ పొరపాటున మెసేజ్ పంపిస్తే.. దాన్ని పంపించిన వాళ్లకు డిలీట్ చేయకుండా.. తాము డిలీట్ చేసుకుంటారు. ఆ సమయంలోనే ఈ ఫీచర్ మీకు ఉపయోగపడనుంది.అటువంటి వారి కోసమే.. వాట్సప్ అన్ డూ అనే ఆప్షన్ ను తీసుకొచ్చింది.
WhatsApp : దానికోసమే అన్ డూ ఆప్షన్ ను తీసుకొచ్చిన వాట్సప్
వాట్సప్ అన్ డూ అనే ఆప్షన్ ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్ డిలీట్ ఫర్ మీ చేసినా కూడా దాని మీద ప్రెస్ చేస్తే.. డిలీట్ అన్ డూ అనే పాప్ అప్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ను క్లిక్ చేస్తే.. డిలీట్ అయిపోయిన మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది. దీనితో పాటు.. మెసేజ్ ఎడిట్ ఆప్షన్ ను కూడా వాట్సప్ త్వరలో తీసుకురానుంది. దానికోసం.. ఎవరికైనా పంపించిన మెసేజ్ పై హోల్డ్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దీంతో ఆ మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చు. అయితే.. ఈ ఫీచర్లు ఇంకా పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాలేదు. త్వరలో బీటా టెస్టింగ్ పూర్తి చేసి అందరు యూజర్లకు ఈ ఫీచర్లను వాట్సప్ తీసుకురానుంది.