Ali : ఆ నాలుగు నియోజకవర్గాల్లో సర్వే చేయించిన కమీడియన్ ఆలీ – ఫైనల్ అయిన టికెట్ ఇక్కడే?
Ali : టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చాక అలీ.. తన సినిమా మిత్రుడు అయిన పవన్ కళ్యాణ్ కు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు అలీ. వైసీపీ పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తామని, రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు అని కూడా అలీ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కుతుహలంతో ఉన్నారు. అందుకే.. ఏ నియోజకవర్గం అయితే తనకు అనుకూలంగా ఉందే తానే కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నారు.
ఎమ్మెల్యే లేదంటే ఎంపీగా పోటీ చేయాలని అలీ అనుకుంటున్నారు కానీ.. ఎంపీ టికెట్ వస్తుందో లేదో కానీ.. సీఎం జగన్ మాత్రం అలీకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ మాత్రం కన్ఫమ్ చేయనున్నారు. ఇప్పటికే అలీ.. గుంటూరు, కడప, కర్నూలు, రాజమండ్రి నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ఆ సర్వేల్లో తాను ఏ నియోజకవర్గంలో నిలబడ్డా గెలుస్తా అనే సర్వే రిపోర్ట్ వచ్చిందట. దీంతో సీఎం జగన్ ను ఆ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గంలో తనకు సీటు ఇవ్వాలని అలీ కోరనున్నారట. తనను ఎమ్మెల్యేగా నిలబెడితే ఎన్నికల కోసం అయ్యే ఖర్చును తానే భరించాలని అనుకుంటున్నారట అలీ. అందుకే దాని కోసం ప్రత్యేకంగా కొంత నగదును కూడా పక్కన పెట్టారట.
Ali : ఎన్నికల ఖర్చును తానే భరించనున్నాడా?
కానీ.. అలీ సర్వే నిర్వహించుకున్న నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి వేరే నేతలు కూడా పోటీగా ఉన్నారు. గుంటూరు తూర్పు నుంచి ముస్తఫా ఉండగా, కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి, కడప నుంచి అంజద్ భాషా.. ఇలా ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీకి టికెట్ దక్కుతుందా? లేదా? అనేదే పెద్ద ప్రశ్న. మరి.. సీఎం జగన్ అలీకి ఈ నాలుగు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయిస్తారా? లేదా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.