బాబు – జగన్ ఇద్దరు ఇద్దరే.. ప్రజల సోయి లేనేలేదు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకంరగా ఉన్నాయి. కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన ఇంటిని వదలడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే మనవడితో సరదాగా సమయంను గడిపేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రజల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమయంలో నిధులు విడుదల చేయడం కాకుండా ప్రజలకు ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉందంటూ కొందరు సూచిస్తున్నారు.
నగదు ఇస్తే సరిపోతుందా..
ఆర్థికంగా చితికి పోయిన వారికి అవసరం అయినంత డబ్బును ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నాడు. చావు బతుకుల్లో ఉన్న వారిని కాకుండా చనిపోయిన వారిని గురించి పట్టించుకోవడం ఏంటీ సీఎం గారు అంటూ సొంత పార్టీ నాయకులే కొందరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్సీజన్ సిలిండర్ల కొరత మరియు ఔషదాల కొరత ఉన్నా కూడా పట్టించుకోకుండా తాడేపల్లిగూడెంలోని తన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.
బాబు ఎక్కడ..
ఈ సమయంలో ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రభుత్వంను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎక్కడ కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కొడుకుతో సమయంను గడుపుతున్నాడు. గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజల పట్ల సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు.