Tirupati Exit Polls : తిరుపతిలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది? ఇదిగో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు?
Tirupati Exit Polls : తిరుపతి ఉపఎన్నికను ఏపీలోని ప్రధాన పార్టీలు చాలెంజింగ్ గా తీసుకున్నాయి. అధికార పార్టీ వైసీపీతో పాటు… టీడీపీ కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే… తిరుపతి ఉపఎన్నికలో పోరు ఈ రెండు పార్టీల మధ్యే నడిచింది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ కూడా తెగ ఆరాటపడినా… బీజేపీకి ఏపీలో ఇంకా గెలిచే అవకాశాలు రాలేదు. ఏపీలో బీజేపీ పార్టీ బలపడాలంటే ఇంకా చాలా కష్టపడాలి. ముఖ్యంగా కేంద్రం ఏపీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపట్ల ఏపీ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో… బీజేపీ పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే… తిరుపతిలోనూ పోటీ అధికార వైసీపీ, టీడీపీ మధ్యే.
తిరుపతి ఉపఎన్నిక ఫలితాలు మే 2న విడుదల కానుండగా… తిరుపతిలో ఎవరు గెలుస్తారు అనేదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే.. తిరుపతి ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు సర్వే నిర్వహించాయి. అవి ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఆరా అనే సర్వే సంస్థతో పాటు… ఆత్మసాక్షి అనే మరో సంస్థ కూడా తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది.
Tirupati Exit Polls : తిరుపతిలో గెలుపెవరిదో చెప్పేశాయ్
అయితే… ఆత్మసాక్షి అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… వైఎస్సార్సీపీ పార్టీ 59.25 శాతం ఓట్లతో తిరుపతిలో గెలుస్తుందని చెప్పేసింది. అలాగే… టీడీపీ 31.25 శాతం, బీజేపీ 7.5 శాతం ఓట్లను సాధిస్తుందని.. స్పష్టం చేసింది. ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా వైసీపీనే గెలవబోతోంది. వైసీపీకి 65.85 శాతం ఓట్లు లభించగా… టీడీపీకి 23.10 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని… బీజేపీకి 7.34 శాతం, ఇతర పార్టీలకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రకటించింది. అంటే ఎటు చూసినా.. ఏ సంస్థ ఎగ్జిట్ పోల్స్ చూసినా… తిరుపతిలో విజయం అధికార పార్టీ వైఎస్సార్సీపీదే.