Bandla Ganesh : ఒక్క రోజు ఆలస్యమైతే చచ్చేవాడిని.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bandla Ganesh : ఒక్క రోజు ఆలస్యమైతే చచ్చేవాడిని.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

Bandla Ganesh బండ్ల గణేష్ Bandla Ganesh సోషల్ మీడియా Social Media లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే ట్వీట్లు, చెప్పే మాటలు, షేర్ చేసే కొటేషన్లు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్‌కు గత ఏడాది కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కోలుకుని బయటకు వచ్చిన బండ్ల గణేష్ పూర్తిగా మారిపోయాడు. వేదాంతధోరణిని ఎత్తుకున్నాడు. పూర్తిగా రాగద్వేషాలకు దూరంగా ఉండిపోయాడు. ఉన్నంత కాలం మంచిగా ఉండాలని కరోనా […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :25 August 2021,8:10 pm

Bandla Ganesh బండ్ల గణేష్ Bandla Ganesh సోషల్ మీడియా Social Media లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే ట్వీట్లు, చెప్పే మాటలు, షేర్ చేసే కొటేషన్లు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్‌కు గత ఏడాది కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కోలుకుని బయటకు వచ్చిన బండ్ల గణేష్ పూర్తిగా మారిపోయాడు. వేదాంతధోరణిని ఎత్తుకున్నాడు.

Bandla Ganesh About On Chiranjeevi

Bandla Ganesh About On Chiranjeevi

పూర్తిగా రాగద్వేషాలకు దూరంగా ఉండిపోయాడు. ఉన్నంత కాలం మంచిగా ఉండాలని కరోనా నేర్పిందని చెప్పుకొచ్చాడు.అయితే బండ్ల గణేష్‌ Bandla Ganesh కు రెండో సారి కూడా కరోనా వచ్చింది. ఈ విషయం మీడియాలో ఎక్కువగా రాలేదు. కానీ అది చాలా సీరియస్ అయిందట. ఇంటిల్లి పాది కరోనాతో కొట్టుమిట్టాడారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తనకు రెండో సారి కరోనా వచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

 

బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ Bandla Ganesh

Bandla Ganesh About On Chiranjeevi

Bandla Ganesh About On Chiranjeevi

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానే కరోనా వ్యాప్తి చెందింది. ఆ ఈవెంట్‌‌లో పాల్గొన్న వారిలో చాలా మందికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.కరోనా రావడం, అది చాలా సీరియస్ అవ్వడం, లంగ్స్ మొత్తం పాడయ్యాయట. ఇక ఒక్కరోజు ఆలస్యం అయితే చచ్చిపోయే వాడిని అని చెప్పాడు. అప్పుడు ఏ హాస్పిటల్‌కి ఫోన్ చేసినా సరే ఎవ్వరూ బెడ్స్ లేవని అన్నారు. చివరకు అపోలోకి కూడా చేశాను. వారు కూడా లేవని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు చేద్దామని అంటే.. ఆయనకు కూడా అప్పుడే కరోనా వచ్చింది.

ఇక చిరంజీవికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాను.. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు.. ఆయన వెంటనే ఫోన్ పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేసేశారు అని బండ్ల గణేష్ నాటి విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు మళ్లీ జీవితాన్ని ఇచ్చాడు అని చిరంజీవి గురించి బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

 

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది