YS Viveka Murder Case : వివేక హత్య కేసులో అసలు నిందితులెవరో సిబిఐ చెప్పేసింది
YS Viveka Murder Case : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటి వరకు తేలలేదు. చివరకు ఈ కేసులో సీబీఐ కూడా తలదూర్చాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ కేసు విచారణ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసుకి సంబంధించి పలువురు నిందితులను సీబీఐ విచారించింది. అందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడు. ఆయన తాజాగా బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. ఈ కేసులో ప్రముఖులు కూడా ఉన్నారు అనే వార్త బలంగా వినిపిస్తోంది. అసలు వివేకానంద హత్య ఎందుకు జరిగిందో.. సీబీఐ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికే పలువురితో సీబీఐ మాట్లాడింది. వారి నుంచి వాంగ్మూలాన్ని కూడా సేకరించింది.
తాజాగా సీబీఐ వేసిన కౌంటర్ లో వైఎస్ వివేకా హత్యకు ఎలా బీజం పడిందో స్పష్టంగా తెలిపింది. 2013 లో వివేకా వైసీపీలో చేరారని.. 2014 లో వివేకాకు వైసీపీ నుంచి టికెట్ దక్కలేదని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును ఆయన ఆశించారని, కానీ.. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వివేకాను ఓడించారని సీబీఐ పేర్కొంది. వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అప్పుడు పులివెందుల డివిజన్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఆ సమయంలో అవినాశ్ రెడ్డికి సన్నిహితుడైన శివశంకర్ రెడ్డి ఆ బాధ్యతలను చూసుకున్నారు. అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ను వివేకాకి ఇవ్వకుండా శివశంకర్ రెడ్డికి ఇచ్చేందుకు అవినాశ్ రెడ్డి ప్రయత్నించారు. కానీ.. వైఎస్ వివేకాకే టికెట్ దక్కింది. అప్పుడే వైఎస్ వివేకా వీళ్లకు కామన్ శత్రువు అయ్యారు. ఆయనపై పగ పెంచుకున్నారు. వాళ్లకు గంగిరెడ్డి తోడయ్యారు.
YS Viveka Murder Case : వివేకాకి కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు
2019 ఎన్నికల్లో వైఎస్ వివేకా ఎన్నికల బరిలోకి దిగితే తమ పరిస్థితి దారుణంగా అవుతుందని భావించారు. అందుకే రాజకీయంగా దూకుడు మీద ఉన్న వివేకాకు బ్రేకులు వేయాలని అనుకున్నారు. ఇవన్నీ వివేకాకు తెలియలేదు. కడప ఎంపీ సీటును షర్మిల లేదా విజయమ్మకు ఇచ్చి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ను అవినాశ్ రెడ్డికి ఇప్పించేలా ప్రయత్నాలు చేశారు. కానీ.. అవినాశ్ రెడ్డి మాత్రం ఆయనపై కక్ష పెంచుకోవడం, సర్పంచ్ ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి కుటుంబానికి వివేకా మద్దతు ఇవ్వకపోవడంతో ఎలాగైనా వివేకాను పక్కకు తప్పించాలని ఆయన హత్యకు పక్కా ప్లాన్ వేశారని సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన దాంట్లో పొందుపరిచింది.