Etela Rajender : ఈటల రాజీనామా చేస్తే.. ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగేది ఈ నాయకుడే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Etela Rajender : ఈటల రాజీనామా చేస్తే.. ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగేది ఈ నాయకుడే?

Etela Rajender : ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు, టీఆర్ఎస్ పార్టీకి మధ్య అస్సలు పొసగడం లేదు. ఈటలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య వైరం రోజురోజుకూ పెరుగుతోంది. డైరెక్ట్ గా సీఎం కేసీఆర్.. ఈటల పై ఎటువంటి ఆరోపణలు చేయకున్నా.. మంత్రులు మాత్రం ఈటలపై తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంటే.. ఈటలను మంత్రి వర్గం నుంచి తీసేయడమే కాదు.. పార్టీ నుంచే తొలగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 May 2021,10:00 am

Etela Rajender : ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు, టీఆర్ఎస్ పార్టీకి మధ్య అస్సలు పొసగడం లేదు. ఈటలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య వైరం రోజురోజుకూ పెరుగుతోంది. డైరెక్ట్ గా సీఎం కేసీఆర్.. ఈటల పై ఎటువంటి ఆరోపణలు చేయకున్నా.. మంత్రులు మాత్రం ఈటలపై తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంటే.. ఈటలను మంత్రి వర్గం నుంచి తీసేయడమే కాదు.. పార్టీ నుంచే తొలగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని అర్థం చేసుకోవచ్చు. అయితే.. డైరెక్ట్ గా ఈటలను పార్టీ నుంచి తొలగించడం కంటే.. ఆయనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. అందుకే.. పొమ్మనకుండా ఆయనపై పొగ పెడుతున్నారు. ఇప్పటికే.. అచ్చంపేట భూకబ్జాపై ఈటల రాజేందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ కూడా కొనసాగుతోంది.

who will contest from trs in huzurabad if etela resigns

who will contest from trs in huzurabad if etela resigns

ఈనేపథ్యంలో ఈటల రాజేందర్ తనకు తానుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎలా? అనే ఆలోచనలో టీఆర్ఎస్ పడింది. అందుకే… వెంటనే ఈటలపై టీఆర్ఎస్ పార్టీ తమ అస్త్రాన్ని దింపింది. తెరపైకి వినోద్ కుమార్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈటల రాజీనామా చేస్తే 6 నెలల లోపు హుజూరాబాద్ లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే.. ముందే ఈటలకు దీటైన నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను బరిలోకి దింపనున్నట్టు సమాచారం. వినోద్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా వినోద్ కుమార్ అయితేనే ఈటలకు గట్టి పోటీ ఇవ్వగలరని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందట.

Etela Rajender : అసలు ఈటల రాజీనామా చేస్తారా? చేయరా?

నిజానికి.. ఈటల రాజేందర్ ఇంకా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. అసలు ఆయన చేస్తారా? అనేది కూడా డౌటే. ఎందుకంటే.. ఈటల రాజేందర్ అనుచరులు కానీ.. ఆయన అభిమానులు కానీ.. టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే.. ఎమ్మెల్యేగానే ఉండాలని.. రాజీనామా చేయకూడదని అంటున్నారు. మంత్రివర్గం నుంచి అర్థాంతరంగా తొలగించి.. అవమానించడం కరెక్ట్ కాదని.. అందుకే టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలంటే ఎమ్మెల్యేగానే ఉండాలంటూ సూచిస్తున్నారట. అయితే.. మరికొందరు ఈటల సన్నిహితులు మాత్రం… పార్టీ నుంచి ఈటలను బహిష్కరించడానికి ముందే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచిస్తున్నారట. ఎలాగూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తుంది కాబట్టి.. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఘోరంగా ఓడిస్తే.. అప్పుడు పార్టీ పరువు పోతుందని.. అందుకే రాజీనామా చేయాలంటూ సూచిస్తున్నారట. ఈనేపథ్యంలో ఈటల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది