BJP – Janasena Alliance : ఎందుకు ఆ విషయంలో మాత్రం బీజేపీ – జనసేన సైలెంట్ అయిపోయింది?
ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదించారు కానీ.. మొన్నటి దాకా ఏపీలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులే సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి కదా. అసలు.. వరుసగా దేవాలయాలపై దాడులు జరగడం ఏంది? విగ్రహాలను ధ్వంసం చేయడం ఏంది? అసలు.. ఏమాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. అసలు.. ఆ దాడులు ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసులు కూడా దేవాలయాలపై జరుగుతున్న ఘటనలపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్న ఏర్పాటు చేసింది.

Why bjp and janasena alliance silent over temples attack in ap
అసలు నిందితులెవరో తెలియాలంటే ఇంకా పోలీసుల దర్యాప్తు తేలాలి. కానీ.. రాజకీయ లబ్ధి కోసమే విగ్రహాలను కావాలని ధ్వంసం చేయించారు అనేది ప్రాథమిక విచారణలో తెలింది. కానీ.. ఎవ్వరు చేయించారు అనేదానిపై ఆధారాలు దొరికితే వాళ్ల ఖేల్ ఖతమే. అయితే.. కొన్ని దాడులు మాత్రం టీడీపీ నేతల వల్ల జరిగాయి.. అని పోలీసులు తేల్చారు.
రాజమండ్రిలో ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలోని స్వామి వారి విగ్రహాన్ని కావాలని టీడీపీ నాయకులు ఆ ఆలయ పూజారికి 30 వేల రూపాయలు ఇచ్చి.. ఆయనతోనే ధ్వంసం చేయించారని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు సర్వత్రా ఆందోళన కలిగిస్తుంటే.. ఈ దాడులపై బీజేపీ, జనసేన కూటమి మాత్రం కిక్కుమనడం లేదు. మౌనమే మా సమాధానం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు బీజేపీ, జనసేన నేతలు.
బీజేపీ – జనసేన పార్టీలు టీడీపీకి కూడా మిత్రపక్షమేనా? అందుకే నోరు మెదపడం లేదా?
బీజేపీ, జనసేన రెండు పార్టీలు ఒకప్పుడు టీడీపీతో దోస్తీ చేసినవే. అవన్నీ ఒక మూలానికి చెందినవే. చాలా రోజుల పాటు ఈ పార్టీలు టీడీపీతో కలిసి పనిచేయడం వల్లనే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న దాడులపై బీజేపీ, జనసేన మౌనం వహిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇవే వార్తలు. అసలు.. దేవాలయాలపై దాడులు చేయిస్తున్నదే టీడీపీ అంటూ.. మొదటి నుంచి అధికార పార్టీ వైసీపీ మొత్తుకుంటోంది. కానీ.. టీడీపీని సేవ్ చేయడం కోసం… వైసీపీ మీద నేరం మోపడం, సీఎం జగన్ ను కార్నర్ చేయడం కూడా మనం చూశాం.
అయితే.. టీడీపీ తమకేమీ తెలియదంటూ ప్రవర్తించినా.. ఇటీవల కొన్ని ఆధారాలు దొరకడంతో టీడీపీ నేతలు భుజాలు దడుముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. బీజేపీ, జనసేన మాత్రం మాకెందుకు ఈ పంచాయతీ అన్నట్టుగా దేవాలయాల దాడులపై సైలెంట్ అయిపోయింది. చూద్దాం.. ఇంకా ఎన్న రోజులు సాగుతుందో ఈ నాటకం.