ఆ విషయం తెలిశాక కూడా రెచ్చిపోకుండా మౌనంగా ఉన్న చంద్రబాబు? కారణం ఇదేనా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటి అంటే… తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను మార్చడం. ప్రస్తుతం ఈ టాపిక్ మీద బాగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంత సీరియస్ విషయంపై చర్చ నడుస్తున్నా.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం నోరు విప్పడం లేదు. అదే ప్రస్తుతం పెద్ద డౌట్ ను క్రియేట్ చేస్తోంది.
ఎందుకంటే.. చంద్రబాబుకు ఇవన్నీ ముందే తెలుసు. ఆయనకు ఇటువంటి విషయాలు ముందే తెలుస్తాయి. ఆయనకు ఉన్న నెట్ వర్క్ అటువంటిది. అంత పెద్ద నెట్ వర్క్ ఉన్న వ్యక్తి… ఈ విషయం తెలిసి కూడా అగ్గి మీద గుగ్గిలం కావాలి కదా. కానీ కాలేదు. పత్రికల్లోనూ ఈ వార్తలు వచ్చేశాయి.
మరోవైపు సీపీఐ నారాయణ.. ఈ విషయంపై వ్యాఖ్యానించిన తర్వాత వెంటనే మీడియాలోనూ న్యాయమూర్తుల మార్పునకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తాయి.
అలాగే.. ఓవైపు తెలంగాణ సీఎం.. మరోవైపు ఏపీ సీఎం.. ఇద్దరూ వెంటవెంటనే కేంద్ర హోంమంత్రిని కలవడం.. చివరకు జగన్ ఢిల్లీలో ఉండగానే… న్యాయమూర్తుల విషయంపై వార్తలు రావడంతో… ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అన్న అనుమానమూ రాకతప్పదు.
అయితే.. ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు మౌనం గురించి. ఆయన మౌనం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందని.. అందుకే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారని.. త్వరలోనే చంద్రబాబు దీనిపై ఏదో ఒకటి చేసి.. రచ్చ రచ్చ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. చూద్దాం… భవిష్యత్తులో ఏం జరుగుతుందో?